English | Telugu

Sravanthi chokkarapu: వరదభాదితులకి లక్ష రూపాయలు విరాళమందించిన యాంకర్ స్రవంతి చొక్కారపు!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సేవ చేసేవాళ్ళున్నారు. వారిలో‌ కొంతమంది ఊళ్ళని దత్తత తీసుకున్నవాళ్ళు ఉన్నారు.‌ కానీ చిన్న సెలెబ్రిటీలు తమ స్థాయికి మించి సాయం చేస్తే వారిని అభిమానులు గుర్తుంచుకుంటారు.

అలా సాయం చేసి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది యాంకర్ స్రవంతి చొక్కారపు. తాజగా కురిసిన భారీ వర్షాలకి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదలొచ్చాయి. కొన్ని గ్రామాలు ముంపుకి గురయ్యాయి. అయితే అలా వరదల్లో చిక్కుకున్న వారికి కొంతమంది విరాళాలు ఇస్తున్నారు. అయితే స్రవంతి తన వంతుగా లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది. ఇదే విషయం తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది. ఇక స్రవంతి చేసిన ఈ ట్వీట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎమ్ఓ అధికారిక ట్విట్టర్ పేజీలని కూడా ట్యాగ్ చేసింది‌. ఇక తను చేసిన ఈ సాయానికి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీంతో స్రవంతి చొక్కారపు నెట్టింట వైరల్ గా మారింది.

స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైన్లోకి వచ్చింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరు ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్ మారిపోయింది. ఆ తరువాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.