English | Telugu

రష్మీని ఏడిపించిన జబర్దస్త్ టీం లీడర్

'ఎక్స్ట్రా జబర్దస్త్' యాంకర్ రష్మీ గౌతమ్ వెరీ సెన్సిటివ్. 'ఢీ' షో లో ఎవరైనా మహిళలు, వృద్ధులు, మూగ జీవాలు ఎదుర్కొంటున్న సమస్యలపై డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తే ఎమోషనల్ అవుతుంది. వెంటనే కనీళ్ళు పెట్టుకుంటుంది. 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో మాత్రం నవ్వుతూ ఉంటుంది. అటువంటి రష్మీని టీమ్ లీడర్ 'రాకింగ్' రాకేష్ ఏడ్పించాడు.

వినాయక చవితి సందర్భంగా చేసిన ఒక ఈవెంట్‌లో 'సుడిగాలి' సుధీర్‌కు రష్మీ గౌతమ్ ప్రపోజ్ చేసింది. తొమ్మిదేళ్ల ప్రేమకు తీపి గుర్తులుగా తొమ్మిది బహుమతులు ఇస్తూ ఒక పెర్ఫార్మన్స్ చేసింది. దాన్ని రాకేష్ పేరడీ చేస్తూ స్కిట్ చేశాడు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్‌లో టెలికాస్ట్ కానుంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రోమోలో రాకేష్ పేరడీ స్కిట్ గ్లింప్స్‌ చూపించారు. ఆ స్కిట్ చూసి రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకుంది.

తన పెర్ఫార్మన్స్ స్పూఫ్ చేసినందుకు రష్మీ గౌతమ్ భావోద్వేగానికి గురైందా? మరొకటా? అన్నది ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది. రష్మీ ఎమోషనల్ కావడంతో స్కిట్ మధ్యలో ఆపేసి రాకేష్ స్టేజి దిగాడు. మొత్తం మీద కొంత డిస్ట్ర‌బెన్స్‌ జరిగిందనేది స్పష్టమవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.