English | Telugu

రష్మీని యాంకరింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారా ?


నిజంగా ఒకప్పుడు సుమ యాంకరింగ్ నుంచి తప్పుకోవాలంటూ బుల్లితెర మీద చాలా మంది కామెంట్స్ చేసారు. ఇక ఇప్పుడు రష్మీ మీద అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో యాంకరింగ్ నుంచి రష్మీని తప్పించే ప్లాన్ కనిపిస్తోంది. ఐతే చాలామంది రష్మీకి సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. ముఖ్యంగా రాకెట్ రాఘవ మాత్రం మందు బోటిల్ చేతిలో పట్టుకుని వచ్చి మరీ రష్మీ గురించి చెప్పాడు. వస్తూనే పుష్పలో శ్రీవల్లి డైలాగ్ ని చెప్పించాడు రాఘవ.. ఒకతన్ని నిలబెట్టి నువ్వెవరు అంటే రష్మీ గారి రైటర్ ని అన్నాడు ఇంకోకతన్ని చూపించేసరికి రష్మీ డ్రైవర్ అని చెప్పాడు. ఇంకో వ్యక్తిని అడిగితె రష్మీ మేకప్ మ్యాన్ అని చెప్పాడు.

"అదిరా రష్మీ అంటే పేరు కాదురా బ్రాండ్..అలాంటి రష్మీని తీసేద్దామనుకుంటున్నారా మీరు ..అసలు రష్మీ అంటే ఎవరనుకుంటున్నారా..పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో ఫంక్షన్ కి వెళ్లే అమ్మాయిలా తయారై వచ్చి అల్లరి చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది " అంటూ తాగిన మైకంలో రష్మీ గురించి చెప్పాడు. ఇక రష్మీ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వేశారు. రష్మీని యాంకరింగ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నారని తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయని ఆ న్యూస్ లో చెప్పుకొచ్చారు. ఇక ఆమె పరిస్థితి తెలుసుకుని పలువురు సినీప్రముఖులు పరామర్శిస్తున్నారు. అని చెప్పారు. దాంతో రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.