English | Telugu

అల్లరిపాలెం అనసూయ v / s చెప్పంపాలెం సుధీర్

సూపర్ సింగర్ జూనియర్ షో చిన్న పిల్లల పాటలతో ప్రతీ వారం అద్దిరిపోతూ మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుంటోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ ఫోక్ థీమ్ సాంగ్స్ తో ఇరగదీసేందుకు పిల్లలు సిద్ధమైపోయారు. ఇక ఈ ప్రోమో ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇందులో అల్లరిపాలెం నుంచి అనసూయ లంగా వోణిలో పొడవాటి జడతో అందంగా తయారై రాగా మరో హోస్ట్ చెప్పంపాలెం నుంచి సుధీర్ ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చి కాసేపు ఒకరినొకరు ఆటపట్టించుకుని స్టేజిని నవ్వులతో ముంచేశారు. ఇక ఈ షోకి స్పెషల్ జడ్జిగా మాల్గాడి శుభ గారిని ఇన్వైట్ చేస్తారు. ఇక మాల్గాడి శుభ గారి పాట పాడే విధానం గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వస్తూనే పకడో,పకడో అంటూ హుషారెత్తించే పాట పాడేసి స్టేజి మీద అందరిని లేచి డాన్స్ చేసేలా చేసి ప్రోగ్రాంని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.

ఇక జూనియర్ సందీప్ మంచి జోష్ తో " ఆ గట్టునుంటావా నాగన్న " పాట పాడి అందరిని మెప్పించాడు. "మంచి ఫైర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావ్ సందీప్ " అంటూ మాల్గాడి శుభ ఆ కుర్రాడికి మంచి కామెంట్ ఇస్తారు. ఇక "లాలూదర్వాజ లష్కర్" పాట పాడి భువనేష్ అడ్డరగొట్టేసాడు. "జోలాజో లాలి జోల నిత్యమల్లె పూల జోల" పాటను పాడి శ్రీకీర్తి స్టేజి మీద ఒక హాయితనాన్ని అందించింది. ఈ పాట పూర్తయ్యాక హేమచంద్ర ఒక విషయాన్నీ చెప్తారు. తన కూతురు శిఖరని నిద్ర పుచ్చేటప్పుడు భార్గవి ఇలాంటి పాటలు పాడుతుంది ఆ రిథమ్ కి తాను నిద్రపోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.