English | Telugu

మీరు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి.. పొట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటారా?

తెలుగు టీవీ యాంక‌రింగ్‌కు గ్లామ‌ర్‌ను అద్దిన వారిలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అన‌సూయ యాంక‌రింగ్ చేసిన షోల‌న్నీ సూప‌ర్ హిట్ట‌య్యాయి. జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా ఆమెకు ప్ర‌త్యేక‌మైన క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె క్రేజ్‌ను సినిమావాళ్లు కూడా క్యాష్ చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇప్ప‌టికే ఆమె కొన్ని సినిమాల్లో త‌న గ్లామ‌ర్‌తో, త‌న యాక్టింగ్‌తో అల‌రించింది.

సోష‌ల్ మీడియాలోనూ అన‌సూయ య‌మ యాక్టివ్‌. త‌న గ్లామ‌ర‌స్‌ ఫొటోల‌ను రెగ్యుల‌ర్‌గా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందం క‌లిగిస్తూ ఉంటుంది. షోల‌లో ఆమె వేసుకొనే డ్ర‌స్సుల‌పై త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతుంటాయి. అప్పుడ‌ప్పుడు ప్ర‌శ్న‌-జ‌వాబు సెష‌న్ నిర్వ‌హిస్తూ, ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇస్తుంటుంది అన‌సూయ‌.

కాగా సోమ‌వారం సందీప్ కోరేటి అనే నెటిజ‌న్ అన‌సూయ డ్ర‌స్సింగ్‌పై చేసిన కామెంట్, దానికి అన‌సూయ ఇచ్చిన రిప్లై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. "అన‌సూయ గారూ.. మీరు ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుంటారా తెలుగు ఆడ‌ప‌డుచుల ప‌రువు తీస్తున్నావు" అంటూ ఓ నోట్ పెట్టాడు సందీప్‌. దానికి త‌న‌దైన శైలిలో ఆన్స‌ర్ ఇచ్చింది అన‌సూయ‌. "దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు." అని ఆమె రాసుకొచ్చింది.

మ‌రోవైపు అన‌సూయ ఫ్యాన్స్ కూడా సందీప్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అత‌డిని "నీ ప‌ని నువ్వు చూసుకోరా.. పెళ్ల‌యి పిల్ల‌లున్న హీరోలు టాప్‌లెస్‌గా క‌నిపించ‌వ‌చ్చా, షార్ట్స్ వేసుకోవ‌చ్చా?" అని అత‌డికి ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు సంధించారు. పాపం సందీప్‌.. !!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.