English | Telugu

Illu illalu pillalu : కూతురు చేసిన పనికి ఎమోషనల్ అయిన రామరాజు.. ప్రేమ షాక్!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -352 లో.. అమూల్య, విశ్వ ప్రేమ విషయం ఇంట్లో తెలిసి అందరు బాధపడుతారు. కొడుకులే అనుకున్నాను.. కూతురు కూడా.. నా గుండెలపై తన్నింది. నీకు ఏం లోపం చేశానమ్మ వాళ్లు మన శత్రువులు అని తెలుసు.. ఎన్నిసార్లు వాళ్ళు నన్ను అవమానించారు.. అది గుర్తు కి రాలేదా తల్లి అని రామరాజు ఎమోషనల్ అవుతాడు.

దీనికి కారణం ఆ విశ్వగాడు చెల్లి ని ట్రాప్ చేసాడని ముగ్గురు అన్నతమ్ముళ్లు విశ్వపై గొడవకి వెళ్తారు. విశ్వని కొడుతుంటే తప్పు మా అన్నయ్యది కాదు అమూల్యది అని ప్రేమ చెప్పగానే అందరు షాక్ అవుతారు. అవును అమూల్యనే అన్నయ్య వెంటపడిందని ప్రేమ చెప్తుంది. చెప్పవే ముందు ఎవరు ప్రేమించారని అమూల్యని వేదవతి అడుగగా నేనే ప్రేమించానని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. గతంలో ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు.. నువ్వే ముందు ప్రేమించానని చెప్పమని అమూల్యని ప్రేపర్ చేస్తాడు విశ్వ. దాంతో అమూల్య అలా చెప్తుంది.అమూల్య అలా చెప్పగానే వేదవతి తనని తిడుతుంది. రామరాజుకి తల తీసేసినట్లు అవుతుంది. ఒరేయ్ ఏం పెంపకంరా అని సేనాపతి అంటుంటే అవమానంతో అందరు ఇంట్లోకి వెళ్తారు.

ప్లాన్ సక్సెస్ అయింది త్వరలోనే అంత సెట్ చేస్తానని భద్రవతి, సేనాపతిలతో విశ్వ చెప్తాడు. మరొకవైపు నర్మద దగ్గరికి ప్రేమ వస్తుంది. అక్క ఆ సిచువేషన్ లో అందరు విశ్వనే తప్పు చేసాడనుకుంటున్నారు అందుకే అలా అన్నాను సారీ అని చెప్తుంది. అయిన నర్మద సైలెంట్ గా ఉంటుంది. దాంతో ప్రేమ బాధపడుతుంది. అదంతా చూసి హమ్మయ్య ఇద్దరు మాట్లాడుకోవడం లేదని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.