English | Telugu

ఆదిత్య ఓంకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన బిగ్ బాస్.. ఎంతంటే!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడమంటే కంటెస్టెంట్స్ కి కాసుల పంట అందినట్టే.. హౌస్ లో ఎన్ని వారాలుంటే అంత ఖజానా జేబులో వేసుకోవచ్చు.

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే అయిదు వారాలు పూర్తి చేసుకుంది. అందులో మొదటగా బెజవాడ బేబక్క, రెండో కంటెస్టెంట్ గా శేఖర్ బాషా, మూడో కంటెస్టెంట్ గా అభయ్ నవీన్, నాల్గవ కంటెస్టెంట్ గా సోనియా ఆకుల ఎలిమినేషన్ అయ్యారు. ఇక అయిదో వారం మిస్టర్ కూల్ ' ఆదిత్య ఓం' (Aditya Om) ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ఎవరికి సపోర్ట్ చేయకుండా అందరికి నచ్చేలా ఉంటూ.. డీసెంట్ కంటెస్టెంట్ అని ముద్ర వేసుకున్న మంచోడు ఆదిత్య ఓం. అయితే హౌస్ లో కన్నడ కుట్టీలు యష్మీ, ప్రేరణ చేసిన నామినేషన్ అతని పెద్ద మైనస్ గా మారింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ గా బయటకొచ్చాడు. ఇక హౌస్ లో అతనికి జీరో హేటర్స్ ఉన్నారు.

ఆదిత్య ఓం మొత్తం నాలుగున్నర వారాలపాటు హౌస్ లో ఉన్నాడు. ఆదిత్య ఓం కి బిగ్ బాస్ నిర్వాహకులు బాగానే ఆఫర్ చేశారట. వారానికి రూ.3 లక్షల చొప్పున నాలుగున్నర వారాలకు గానూ దాదాపు రూ.14 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.