English | Telugu

వాటర్ మానిఫెస్టింగ్ గురించి మీకు తెలుసా ? ఇదొక సారి ట్రై చేయండి

నటి మాధవి లతా నీళ్ల గురించి ఒక అద్భుతమైన అనాలసిస్ ఐతే ఇచ్చేసింది. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ భూమి మీద మన శరీరంలో సగం నీరే ఉంటుంది. అలాంటి నీటికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే వాటర్ మానిఫెస్టింగ్ చేయండి అని సలహా ఇచ్చింది. ఇదేంటంటే " వాటర్ మానిఫెస్టింగ్ గురించి మీకు తెలుసా ?? ఒక గ్లాస్ లో నీళ్లు తీసుకుని చేతిని మూతలా అడ్డుపెట్టు 60 సెకెన్ల పాటు కళ్ళు మూసుకుని పాజిటివ్ గా మీరు ఏదైనా అనుకోండి. ఆ తర్వాత ఆ వాటర్ ని తాగేయండి.

ఎందుకంటే వాటర్ కి యూనివర్స్ లో ఉన్న పవర్ అంతా ఉంటుంది. నీటితోనే ఏ రోగాన్నైనా నయం చేయొచ్చు అని డాక్టర్స్ అంటారు. అలాగే మన పెద్దవాళ్ళు కూడా పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని. దానికి కారణం అదే. ఈ మ్యానిఫెస్టేషన్ ని చాలా దేశాల్లో ట్రై చేశారు కూడా. ఎందుకంటే నీటికి ఒక నీతి ఉంటుంది. దాన్ని పాజిటివ్ గా ఆలోచనలతో ఆరాంగా తాగితే గనక అది మన శరీరంలో అన్ని భాగాలకు సక్రమంగా చేరి రోగాలను కూడా దూరం చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి." అంటూ మాధవీలత చెప్పింది. నిజంగా కదా..తిండి లేకపోయినా, నిద్ర లేకపోయినా, గాలి వీచకపోయినా కొన్ని గంటలు, కొన్ని రోజులు ఉండగలం కానీ వాటర్ లేకుండా నీళ్లు తాగకుండా ఒక్క రోజు కాదు కదా ఒక్క పూట కూడా బతకలేము.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.