English | Telugu

నన్ను మోసం చేశారు...నేను మా నాన్నగారిని చాలా మిస్ అయ్యాను

ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఆమని, సింగర్ ఎస్పి చరణ్, కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ వచ్చారు. హోస్ట్ సుధీర్ ఆమనిని చూసి "మేడం మీరెందుకు ఇక్కడికి వచ్చారు" అని అడిగేసరికి "అరే నేను కొనడానికి వచ్చా" అని చెప్పింది. " మీరు సినిమాల్లో భర్తను అమ్మేస్తానంటారు ఇక్కడేమో నన్ను కొంటానంటున్నారు..ఏంటి మేడం ఇది" అని అడిగేసరికి "అంతే మరి..కొంటుంటాం..తీసుకుంటూ ఉంటాం" అని కౌంటర్ వేశారు. తర్వాత తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి ఆమని కన్నీళ్లు పెట్టుకున్నారు. "తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వకముందు తమిళ్ మూవీ కోసం వెళ్లాను. ఆ మూవీ ఇంకా త్రి డేస్ ఉంది. ఆ మూడు రోజులు చేస్తూ ఉండగా లాస్ట్ డే మా నాన్న గారు చనిపోయారు. నాన్నగారికి ఏదో సీరియస్ అని మీ బ్రదర్ ఫోన్ చేసి చెప్పారంటూ ఆ సినిమా టీమ్ వాళ్ళు చెప్పారు. నేను కూడా ఆ మాటల్ని నమ్మాను. ఎందుకంటే సినిమా క్లైమాక్స్ కదా లాస్ట్ డే కదా ఐపోతుంది కదా ఆ తరువాత వెళ్ళొచ్చులే అనుకున్నా.

ఐతే నేను సినిమా పూర్తి చేసి ఇంటికి వెళ్లేసరికి నాన్నగారు చనిపోవడం అన్ని కార్యక్రమాలు జరిగిపోవడం ఐపోయాయి. వాళ్ళ సెల్ఫ్ కోసం నన్ను అలా మోసం చేశారు. లైఫ్ లో మళ్ళీ మా నాన్న గారిని నేను చూడలేను. నేను మా నాన్నగారిని చాలా మిస్ అయ్యాను." అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది ఆమని. తర్వాత ఎస్పీ చరణ్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని చెప్పారు. "ఒక సారి నా కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. చాలా విపరీతమైన పెయిన్, అమ్మ పక్కన పడుకున్నారు. ఆమె నా ఏడుపును, నొప్పిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో ఆమె మా నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. నాన్నగారు వచ్చి నన్ను సాముదాయించి పడుకోబెట్టారు. నేను ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చాను నా మీద కోప్పడడానికి కానీ ఆయనలా చాలా సహనంగా ఉన్న వ్యక్తిని ఇంతవరకు నా జీవితంలో ఎవరినీ చూడలేదు" అని చెప్పారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.