English | Telugu

అభిని వాడుకోవడానికి లాస్య కుట్ర!

అంకిత వాళ్ళ నాన్న ఆస్తి పత్రాలు రాయించడానికి వెళ్లే టైంలో తులసి ఫోన్ చేసి దారిలో కలుస్తుంది. తన జీవితాన్ని పాడు చేసిన లాస్య ఇప్పుడు అభి పేరు మీద ఆస్తి వస్తోందని పసిగట్టి తన బిడ్డను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తోందని బాధపడతుంది. అందుకే ఆస్తిని అభి పేరు మీద కాకుండా అంకిత పేరు మీద పెడితేనే చాలా మంచిదని సలహా ఇస్తుంది. అంకిత వాళ్ళ నాన్న తులసి చెప్పినట్టే చేస్తాడు.

ఆ పత్రాలను తీసుకున్న గాయత్రి అందులో అంకిత పేరు కనిపించేసరికి షాక్ అవుతుంది. "ఇలా ఎవరు చేయమన్నారు.. తులసేనా?" అంటూ అడుగుతుంది. దారిలో జరిగిందంతా చెప్తాడు. "నందు తులసికి విడాకులు ఇచ్చేసి పిల్లల బాధ్యతను గాలికి వదిలేస్తే తులసి ఆంటీ కష్టపడి పిల్లల్ని కాపాడుకుంటోంది. ఇంతకంటే ఏం తెలుసుకోవాలితులసి ఆంటీ మంచితనం గురుంచి?" అంటూ అంకిత గట్టిగా తల్లితో వాదిస్తుంది.

చేసేదేం లేక"ఎవరి పేరు మీదయితే ఏముంది ఆస్తి అంకిత పేరు మీద రాస్తేనే చాలా మంచిది" అంటూ అభి రివర్స్ డ్రామా ఆడతాడు. మరో వైపు ప్రేమ్ తన ఫస్ట్ ఆల్బం కోసం స్పాన్సర్ ని వెతుక్కుంటూ ఒక ఆఫీస్ కి వెళ్తాడు. ఆ మేనేజర్ కి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడతాడు. ఆ మేనేజర్ నాలుగు చీవాట్లేసి గతంలో చేసిన ఆల్బమ్స్ ఉంటే రిఫరెన్స్ కోసం తీసుకురా అంటూ తిప్పి పంపించేస్తాడు. మిగతా ఎపిసోడ్ హైలైట్స్ కోసం ఈరోజు సాయంత్రం మా టీవీలో ప్రసారమయ్యే 'గృహలక్ష్మి' సీరియల్ లో చూడొచ్చు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.