English | Telugu

బాలకృష్ణకు ఫోన్ చేసిన విశ్వక్..షాకైన సుమ

సుమ అడ్డా షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి లైలా మూవీ టీమ్ వచ్చింది.హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ ఆకాంక్ష శర్మ, డైరెక్టర్ రామ్ నారాయణ్, డిజె టిల్లు ఫేమ్ ప్రణీత్ రెడ్డి వచ్చారు. ఈ షో ప్రోమో ఫైనల్ లో బాలకృష్ణ మాట్లాడారు..ఎందుకు మాట్లాడారో చూద్దాం. ఐతే రీసెంట్ గా లైలా మూవీ టీజర్ రిలీజ్ సందర్భంలో బాలకృష్ణ అటు డిజె టిల్లుకి, ఇటు విశ్వక్ సేన్ కి ముద్దులు పెట్టేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సుమ ఆ వీడియో ప్లే చేసి చూపించింది. "అదేం లేదు మేడం మేమందరం కలిసి కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేసాం" అని కవర్ చేసాడు విశ్వక్. కానీ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మాన్షన్ బోటిల్ మూత తీసిన చప్పుడు వినిపించేసరికి "ఆ మాకు అర్ధమయ్యింది" అంది సుమ..కానీ మీ ప్రేమలు చూస్తుంటే నాకు చాలా కుళ్ళుగా ఉంది" అంది సుమ. సరే "ఒక్కసారి బాలకృష్ణ గారికి ఫోన్ కొడతారా" అని విశ్వక్ ని అడిగింది సుమ.

"ఎవరు చేయమన్నారు అని అడిగితే నేను సుమ గారి పేరే చెప్తా" అన్నాడు. "అమ్మో నా పేరు చెప్పొద్దూ" అంటూ సుమ కంగారు పడింది. కానీ ఈలోపు విశ్వక్ బాలకృష్ణకి ఫోన్ చేసాడు. సెట్ లో ఫోన్ రింగ్ అయినా శబ్దం కూడా వినిపించింది. ఫోన్ తీసిన బాలకృష్ణ "ఎవరు" అని అడిగేసరికి సుమ ఒక్క నిమిషం షాకైపోయింది. నిజానికి సెలబ్రిటీస్ ఫోన్స్ అంటే ఎప్పుడూ బిజీ రావడమే వాళ్ళ పిఆర్ వాళ్ళు మాట్లాడడమో చేస్తారు. కానీ ఇక్కడ బాలకృష్ణ ఫోన్ రింగ్ అవడం స్వయంగా ఆయనే మాట్లాడ్డం తో సుమ ఖంగు తిన్నది.


Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.