English | Telugu

Brahmamudi : స్వప్నకి పాప పుట్టినవేళ.. సీతారామయ్య కోమాలోంచి బయటకొచ్చాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -637 లో.... రాజ్, కావ్య డబ్బు డిపాజిట్ చెయ్యడానికి వెళ్తుంటారు. దారిలో రాజ్ కి వెక్కిళ్లు వస్తాయి. రాజ్ కి కావ్య ముద్దు పెడుతుంది. ఏంటి ఇది సినిమా అనుకున్నావా ముద్దు పెట్టగానే వెక్కిళ్లు ఆగిపోవడానికి అంటూ వాటర్ కోసం షాప్ దగ్గర ఆగగా రాజ్ వెళ్లడం చూసి రౌడీ వచ్చి డబ్బు తీసుకొని వెళ్తాడు. రాహుల్ కార్ లో పడేసి పారిపోతాడు. రౌడీని రాజ్ , కావ్య పట్టుకుంటారు. నిన్ను ఎవరు ఇలా చెయ్యమన్నారని బెదిరించగా రాహుల్ అని రౌడీ చెప్తాడు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు.

ఇంటికి వెళ్లి రాహుల్ సంగతి చెప్పాలని రాజ్ అనగానే.. మీరు వెళ్ళండి. ఇప్పుడు నాకు మొత్తం అర్ధం అయింది.. నేను వస్తానంటూ కావ్య అంటుంది. ఇంటికి వెళ్లి రాజ్ రాహుల్ ని కొడతాడు. రెండు కోట్ల డబ్బు కొట్టేసాడని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. అసలు నీ దగ్గర డబ్బు లేదన్నావ్.. నన్ను షేర్ మార్కెట్ వాళ్ళు బెదిరిస్తుంటే కూడా సైలెంట్ గా ఉన్నావని రుద్రాణి అంటుంది. అప్పుడే కావ్య రుద్రాణిని బెదిరించిన వాళ్ళని తీసుకొని వస్తుంది. వీళ్లేనా అంటూ కావ్య అనగానే.. రుద్రాణి షాక్ అవుతుంది. వీళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ లని కావ్య చెప్తుంది. వాళ్ళు కూడా నిజం ఒప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకు ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నావ్ రుద్రాణి అంటూ ఇందిరాదేవి కోప్పడుతుంది. ఇదంతా రాజ్, కావ్య నిజస్వరూపం బయట పెట్టాలని చేసాను.. ఇన్ని రోజులు డబ్బు లేదంటూ ఇంత డబ్బు ఎందుకు దాచిపెట్టుకున్నారని రుద్రాణి అడుగుతుంది. నేనేం చేసిన కంపెనీ కోసమే.. ఏదైనా మూడు నెలల గడువు అడిగాను కదా.. అప్పటి వరకు ఆగండి అని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత మూడు నెలల టైమ్ గడుస్తూ ఉంటుంది. స్వప్నకి నొప్పులు మొదలవుతాయి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కావ్యకి అపర్ణ ఫోన్ చేసి నువ్వు పిన్నివి అయ్యావ్.. స్వప్నకి పాప పుట్టిందని చెప్తుంది. తరువాయి భాగంలో స్వప్న బిడ్డతో హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంది. అప్పుడే డాక్టర్ రాజ్ కి ఫోన్ చేసి మీ తాతయ్య స్పృహలోకి వచ్చాడని చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.