English | Telugu

పృథ్వీకి విష్ణుప్రియ మసాజ్.. ఇది బిగ్ బాస్ హౌసా లేక..?

బిగ్ బాస్ సీజన్-8 పన్నెండో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అదిరిపోయే స్టెప్స్ తో కాస్ట్లీ కాస్ట్యూమ్ తో వచ్చేశాడు. ఇక వచ్చీ రాగానే శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించాడు నాగార్జున.

మెగా చీఫ్ టాస్క్ తర్వాత పృథ్వీ, యష్మీ, నిఖిల్, విష్ణుప్రియ బెడ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకునేది చూపించాడు. ఇక ఇక్కడ యష్మీ, నిఖిల్ సీరియస్ గా మాట్లాడుకుంటుంటే విష్ణుప్రియ మాత్రం పృథ్వీ కాళ్లని ఒళ్లో పెట్టుకుని కాళ్లకి ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తుంది. ఇక పృథ్వీ కాళ్లని తన ఎదకి నొక్కిమరీ ఆయిల్ రాసే సీన్ ఏదైతే ఉందో మామూలుగా లేదు. సొంత పెళ్ళాంలాగా ఫీల్ అవుతుందనిపిస్తోంది. కళామ్మతల్లి ముద్దుబిడ్డ యొక్క బిగ్ బాస్ ప్రేమ కావ్యంలో ఇలాంటి సీన్లు చాలానే ఉన్నాయి. కానీ బిగ్ బాస్ మామ గురించి తెలిసిందేగా .. కొంచెం ఏమైనా విష్ణుప్రియకి నెగెటివ్ అనిపిస్తుందంటే చాలు ఎడిటింగ్ లో లేపేస్తారు. కానీ నిన్నటి ఎపిసోడ్‌లో కనిపించిన ఈ దృశ్యాన్ని నాగార్జునతో పాటు ప్రపంచమంతా కన్నులారా చూసారు. రోజు రోజుకి ఆ కొంపలా మార్చేలా ఉందని విష్ణుప్రియని తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

నిఖిల్‌ పర్సనల్ లైఫ్ గురించి బాధపడుతుంటే.. గౌతమ్ ఓదార్చిన విధానం ఏదైతే ఉందో నేటి ఎపిసోడ్‌లోనే హైలైట్. నిఖిల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని తనకి జరిగిన ఇష్యూని తలుచుకుని బాధపడుతుంటే.. గౌతమ్ వెళ్లి అతనికి ధైర్యం చెప్పాడు. ఇవన్నీ పక్కనపెట్టేసెయ్ మచ్చా.. నువ్వు యంగ్ బాయ్‌వి.. చాలా లైఫ్ ఉంది. ఏదీ హార్ట్‌కి తీసుకోకు. నేను ఎక్స్ పీరియన్స్‌తో చెప్తున్నా.. బయటకు వెళ్లిన తరువాత.. నీకు కావాల్సిన వాళ్లతో మాట్లాడి.. చెప్పాల్సింది చెప్పి.. సెట్ చేసుకో. ఇంక ఎన్నివారాలో లేదు. గేమ్‌ని దృష్టిలో పెట్టుకో.. టఫ్ ఫైట్ ఇవ్వు. ఈ మూడు వారాలు బయట ఏం జరుగుతుందో అని ఆలోచించకని నిఖిల్‌కి ధైర్యం చెప్పాడు గౌతమ్. రియల్ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ కి అర్థం చెప్తూ గౌతమ్ చెప్పిన మాటలని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.