English | Telugu

అన్షుపై విజయ్ బిన్నీ మాస్టర్ ఫైర్.. పండు గెలవాలి అంటూ నెటిజన్స్ కామెంట్స్!

ఢీ 20 లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎక్స్-కంటెస్టెంట్స్ తో డాన్స్ చేశారు. అందరూ పోటాపోటీగా చేశారు. కానీ అన్షు రెడ్డి విషయానికి వచ్చేసరికి విజయ్ బిన్నీ మాస్టర్ ఆమె మీద ఫుల్ ఫైర్ అయ్యారు. "బొమ్మొలే ఉందిరా పోరి.." సాంగ్ కి డాన్స్ చేసింది. ఐతే అందులో ఆమె డాన్స్ అంతగా లేదని ఫీలయ్యాడు జడ్జ్. దాంతో "నాకు అసలు అన్షు ఎక్కువగా చేయలేదు అన్న ఫీల్ వచ్చింది" అన్నాడు. దాంతో డాన్స్ మాస్టర్ ఏదో చెప్పాడు. "బిహైండ్ కెమెరా సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయారు. కాబట్టి ఇది చూడండి మీరు అంటే ప్రోపర్ గా ఉండదు. చాలా మంది ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు " అన్నారు.

లాస్ట్ జతిన్ అలాగే పండు వచ్చి పోటాపోటీగా డాన్స్ చేశారు. దాంతో జడ్జెస్ ఇద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడ్డారు అసలు ఎవరికీ ఎం మార్క్స్ ఇవ్వాలా అని. జతిన్ పెర్ఫార్మెన్స్ కి సంకేత్ వచ్చి షూస్ పక్కకు తీసేసి వాళ్ళను విష్ చేసాడు. ఇక పండు ఐతే ప్రేమికుల రోజు మూవీ నుంచి వాలు కనులదాన అనే సాంగ్ కి చేసిన డాన్స్ ఐతే మాములుగా లేదు. విజయ్ బిన్నీ మాస్టర్ ఐతే స్టేజి మీదకు వచ్చి మెచ్చుకున్నాడు. ఇది చాలా టఫ్ డెసిషన్. ఇలా ఉండాలి పోటీ అంటే. మేమిద్దరం ఇలాంటి ఒక రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ చెప్పింది రెజీనా. ఇక నెటిజన్స్ ఐతే అందరూ పండు గెలవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.