English | Telugu

షో లో  కన్నీళ్లు పెట్టుకున్న సుడిగాలి సుధీర్...

ఫ్యామిలీ స్టార్స్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో సీనియర్ లేడీ యాక్టర్స్ తో మంచి కలర్ ఫుల్ గా సాగింది. అలనాటి అందాల లేడీ కమెడియన్స్ శ్రీలక్ష్మి, వై.విజయ, కృష్ణవేణి, శివపార్వతి వచ్చారు. రాగానే స్టేజి మీద ధర్నా చేయడం మొదలు పెట్టారు. వై.విజయ ఐతే "బావ మారాలి, భర్తగా రావాలి" అని ధర్నా చేసింది. అది చూసిన హోస్ట్ సుడిగాలి సుధీర్ వీళ్ళను చూసి షాకయ్యాడు. తర్వాత షోలో కొంతమంది సీనియర్ నటులకు పవన్ కళ్యాణ్, ప్రభాస్ పిక్స్ చూపించి వాళ్ళ మూవీ డైలాగ్స్ ని చెప్పించాడు. తర్వాత వాళ్లతో లవ్ లెటర్స్ ని రాయించాడు. ఇక వై.విజయ ఐతే చక్కని లవ్ లెటర్ రాసింది. "ఆయన మంచితనం చూసి నేను నాలుగేళ్లు ప్రేమించాను. కానీ ఆయన ఒకే చెప్పలేదు. ఐ లవ్ యు అమ్ము" అంటూ ముద్దులిచ్చేసింది.

తర్వాత ఆమె తెగ సిగ్గుపడిపోయింది. ఈమె ప్రేమను చూసిన సుధీర్ "అరే ఆవిడ బ్లష్ అవుతున్నారు" అని చెప్పి మరి ఇంకా సిగ్గుపడేలా చేసాడు. తర్వాత చొక్కారావు స్రవంతి కూడా సుద్ధేర్ ని అడిగింది. "నువ్వు లవ్ లెటర్ రాయక్కర్లేదు..రాయాలనుకుంటే ఎవరికీ రాస్తావో చెప్పు" అన్నది. అంతే ఆ మాటకు ముఖంలో కన్నీళ్లు వచ్చేసేలా అనిపించాయి.వాటిని దాచుకోవడానికి అన్నట్టు తలదించుకుని "నేను ఒక వేళా లవ్ లెటర్ రాయాల్సి వస్తే కచ్చితంగా వాళ్ళకే" అంటూ ఆపేసాడు. ఇక ఫైనల్ గా కృష్ణవేణి, అనంత్ బాబు కలిసి ఒక స్కిట్ చేసారు. ఈరోజున కొడుకులు ఎలా ఉన్నారో చెప్పడానికి ఆ స్కిట్ వేశారు. ఇలా ఈ వారం షో రాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.