English | Telugu

వాళ్ళు ఆడేది గ్రూప్ గేమ్ కాదు.. కప్ గెలిచినంత హై ఫీల్ ఉంది : రోహిణి

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేషన్ అయ్యింది. తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయిన రోహిణి.. అవినాష్, ప్రేరణ, గౌతమ్ లని హీరో లిస్ట్ లో పెట్టింది. విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ లని విలన్ లిస్ట్ లో పెట్టేసింది.

ఇక హౌస్ నుండి బయటకొచ్చాక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. నిజంగా నీ పర్ఫామెన్స్ కి హ్యాట్సాఫ్ రోహిణి అని అంబటి అర్జున్ అనగా థాంక్స్ అని రోహిణి అంది. సీజన్-3 కి ఈ సీజన్ లో మీ పర్ఫామెన్స్ ఎలా ఉందని అనుకుంటున్నారంటూ యాంకర్ అడుగగా.. చాలా సాటిస్ఫై ఉంది. ఇన్ని వీక్స్ చాలా బాగా ఆడాననే ప్రౌడ్ మూమెంట్ అయితే ఉందని రోహిణి అంది. నువ్వు అసలు ఆడలేవంటూ చాలా మాటలన్నారని యాంకర్ అడుగగా.. చాలా హర్టింగ్ అనిపించిందని రోహిణి అంది‌. పృథ్వీ మీదే ఆడి గెలవడమేది మీరు ఎలా ఫీల్ అయ్యారని యాంకర్ అడుగగా.. ఆ ఫీలింగ్ కప్పు గెలిచినంత ఆనందం రాదేమో.. ఆ ఒక్క మూమెంట్ కి ఐ వాజ్ టూ హై అని రోహిణి అంది. ఓట్ అప్పీల్ చేసుకుంటే మీరు ఈ వారం సేవ్ అయ్యేవారా అని యాంకర్ అనగా.. అలా అని ఏం అనుకోనని రోహిణి అంది. విష్ణు మీద నీ అభిప్రాయం ఏంటి? విష్ణుప్రియ, పృథ్వీల గురించి ఏం అనుకుంటున్నారని యాంకర్ అనగా.. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకొని ఉంటున్నారు కానీ వారి మధ్య కనెక్షన్ ఉందని రోహిణి అంది‌.

నిఖిల్, పృథ్వీ, యష్మీలది గ్రూప్ గేమా అని యాంకర్ అడుగగా. గ్రూప్ గేమ్ అని అనను.. కానీ ఫ్రెండ్స్ అని రోహిణి అంది. నామినేషన్ లో ఒక్కసారి కూడా అవినాష్, తేజలని నామినేట్ చేయలేదు ఎందుకని యాంకర్ అడుగగా.. వాళ్ళు నాకు క్లోజ్ కాబట్టి చిన్న చిన్న తప్పులు కూడా పెద్దగా అనిపించలేదని రోహిణి అంది. అంత పెద్ద మిస్టేక్ చేసినట్టుగా కూడా ఎక్కడా లేదు. గౌతమ్ నిజంగానే సోలో బాయ్ ఆ అని యాంకర్ అనగా‌‌.. కొన్నిసార్లు ఎందుకో మాతో కలిసి ఉండడని అనిపిస్తుందంటూ రోహిణి చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో రోహిణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.