English | Telugu

రుక్మిణిని స‌త్య‌కు ప‌ట్టించింది ఇదే!

శోభ‌న్ బాబు, శ్రీ‌దేవి, జ‌య‌ప్ర‌ద‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `దేవ‌త‌` సినిమా స్ఫూర్తితో రూపొందించిన సీరియ‌ల్ `దేవ‌త‌`. అర్జున్ అంబ‌టి, సుహాసిని, వైష్ణ‌వీ రామిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గ‌త కొన్ని వారాలుగా ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ బుధ‌వారం ఈ సీరియ‌ల్ 403వ ఎపిసోడ్‌లోకి ఎంట‌ర‌వుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. `ఇగో సారూ మీరు రాలేదు కానీ మేమంతా గుడికి వ‌చ్చాం తెలుసా` అంటుంది దేవి ఆదిత్య‌తో..

మీరంతా అంటే ఎవ‌రెవ‌రు వ‌చ్చార‌ని కంగారుగా అడుగుతాడు దేవిని ఆదిత్య‌. అమ్మా, నేను, చిన్మ‌య్‌, నాన‌మ్మ‌` అని చెబుతుంది దేవి. వెంట‌నే ఫోన్ స‌త్య‌కు ఇవ్వు అంటాడు. స‌త్య ఫోన్ తీసుకోవ‌డంతో `నాకు క‌డుపు నొప్పిగా వుంది ఇంటికిరా` అంటాడు ఆదిత్య‌. `దీపాలు పెట్టే వేళ అయింద‌ని ప‌ది నిమిషాల్లో బ‌య‌లుదేర‌తామ‌ని` చెబుతుంది స‌త్య‌. ఫోన్ పెట్టేసిన ఆదిత్య `ఛ‌.. ఇప్పుడు స‌త్య ..రాధ‌ని చూస్తే ప్ర‌మాదం అనుకుంటూ ప‌రుగులు పెడ‌తాడు.

ఆగ‌మేఘాల మీద గుడికి చేరిన ఆదిత్య అక్క‌డ రుక్మిణి, స‌త్య ఒక‌కి ఒక‌రు క‌నిపించేంత దూరంలో దీపాలు పెడుతుంటే చూసి ఆ ఇద్ద‌రికి అడ్డంగా నిల‌బ‌డ‌తాడు. `దీపాలు వ‌దిలేశావ్ క‌దా ఇక ఇంటికి ప‌దా అంటూ స‌త్య‌ని కంగారు పెడ‌తాడు. కారు ఎక్కి స‌త్య‌ని ఎక్క‌మంటాడు. ఈలోగా రుక్మిణి గ‌తంలో ఎక్కి వెళ్లిన కారు క‌నిపిస్తుంది. ఈ కారు ఇక్క‌డ వుందంటే అక్క ఇక్క‌డే వుండివుంటుంది అని ఆదిత్య‌కు చెప్ప‌కుండానే ప‌రుగులు పెడుతుంది. షాక్‌కు గురైన ఆదిత్య‌.. వెంట‌నే స‌త్య వెంట‌ప‌డ‌తాడు. గుడిలో రుక్మిణి కోసం వెతుకుతున్న స‌త్య‌కు తాను ఎదురుప‌డిందా?.. స‌త్య ఏం చేసింది? .. అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.