English | Telugu

పాత కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన వైల్డ్ కార్డ్స్!

బిగ్ బాస్ సీజన్-8కి సంబంధించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆదివారం నాటి ఎపిసోడ్ రీలోడ్ పేరుతో ఏడు గంటలకే మొదలైంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా హరితేజ, నయని పావని, రోహిణి, గంగవ్వ, గౌతమ్, టేస్టీ తేజా, అవినాష్, మెహబూబ్ ఈ ఎనిమిది మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే గత ఐదు వారాలుగా గేమ్‌ని గమనించి మరీ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ ఎనిమిది మంది పాత కంటెస్టెంట్స్‌కి చెమటలు పట్టిస్తున్నారు. మొదటి రోజు ఏం జరిగిందో చూసేద్దాం.

హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ తమ టీమ్ కి వైల్డ్ రాయల్ అని పేరుపెట్టుకోగా.. పాత కంటెస్టెంట్స్ ఓజీ(వొరిజినల్ గ్యాంగ్ స్టర్స్) అని పేరు పెట్టుకున్నారు. ఇక హౌస్ లో‌ కొత్త కంటెస్టెంట్స్ కి పాత కంటెస్టెంట్స్ కి మధ్య మొత్తంగా నాలుగు టాస్క్ లు జరుగగా.. అందులో మూడు వైల్డ్ రాయల్స్ గెలిచారు. ఒక్కటి ఓజీ టీమ్ గెలిచింది. కొత్త వాళ్ళ గేమ్ తీరుకి పాత హౌస్ మేట్స్ మొహాలు వాడిపోయాయి.

బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్పటికే ఐదుగురు ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా.. మొదటి నాలుగు వారాల్లో ఎలిమినేట్ కాగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ఆదిత్య ఓం ఔట్ అయ్యాడు. ఇక తాజాగా నైనిక ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఎలిమినేషన్‌కి ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి నాగార్జున హౌస్‌లో చెప్పారు. కానీ వాళ్లందిరినీ మడతెట్టేస్తాం అంటూ ఓజీ గ్యాంగ్ గట్టిగానే ధీమాగా చెప్పింది. కానీ వెళ్ళు వచ్చాక వీళ్ళ ఆట భయపడింది. " అన్న లేక సుఖాలు ఎక్కువయ్యాయి మీకు.. ఒక్కసారి అన్న వస్తే.. " అన్నట్టుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేంతవరకు చప్పగా సాగిన బిగ్ బాస్ సీజన్-8.. ఇప్పుడు కొత్త కంటెస్టెంట్స్ తో యమ క్రేజ్ తెచ్చుకుంటుంది.‌ ఈ వారం హౌస్ లో వైల్డ్ కార్డ్స్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.