English | Telugu

తండేల్ సినిమా రిలీజయ్యాక నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు


జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో విత్ జగపతి మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ ఎపిసోడ్ కి కింగ్ నాగార్జున వస్తే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఆయన సుపుత్రుడు నాగ చైతన్య వచ్చాడు. "మహానటిలో నాగేశ్వరావు గారి క్యారెక్టర్ చేసావు కదా" అని జగపతి బాబు అడిగారు. " అబ్బా తాతగారికి ఏదో నా ట్రిబ్యూట్ ఇవాలనుకున్నా.. మంచి ఆపర్చ్యునిటీ రావడంతో చేసాను" అన్నాడు నాగచైతన్య. "మనం మీ నాన్నతో చేసావు.

ఆ ఫీలింగ్ ఎలా ఉంది" అని అడిగారు. " అమ్మో కష్టం" అన్నాడు చైతన్యు. "నీ లైఫ్ ని ఒక బుక్ టైటిల్ గా పెట్టాలంటే" అంటూ జగ్గు భాయ్ అడిగారు. "లైఫ్ లో ఫుల్ స్టాప్స్ పెట్టకూడదు..అలా కామాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి." అన్ని చెప్పాడు నాగ చైతన్య. "లవ్లీ, ఐ లవ్ ఇట్" అంటూ జగ్గు భాయ్ లేచి నాగచైతన్యను హగ్ చేసుకున్నాడు. "గొడవుల్లో కూడా అందం ఉంది" అనేసరికి "ఆ గొడవలు లేకపోతె ఆ రిలేషన్ షిప్ రియల్ కాదు. తండేల్ సినిమా రిలీజయ్యాక నాతో కొన్ని రోజులు మాట్లాడలేదు" అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఈ తండేల్ మూవీతో నాగచైతన్య ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్ లో చేరాడు. చైతన్య కెరీర్ లో ఇదొక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి తెరకెక్కిన ఈ తండేల్ లవ్ స్టోరీ ఎంతోమంది ఆడియన్స్ మనసుల్ని దోచుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.