English | Telugu

నయని పావనిని బాడీ షేమింగ్ చేసిన యష్మీ.. సాటి అమ్మాయిని ఇలా అంటారా?

బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ డ్రామా కొనసాగుతుంది. ఎక్కడికెళ్ళిన ప్రేరణ, యష్మీ, పృథ్వీలే కనపడుతున్నారు. అయితే నత్తి బ్రెయిన్ విష్ణుప్రియ ఆ లేజీ అండ్ వేస్ట్ ఫెలో పృథ్వీని ఇష్టపడుతూ తనతోనే తిరుగుతుంది.

వైల్డ్ కార్డులు వచ్చి నామినేషన్ చేసి చెప్పిన తన బిహేవియర్ మార్చుకోవడం లేదు విష్ణుప్రియ. మంచిగా గేమ్ ఆడుతూ అందరితో మాట్లాడుతూ కన్పిస్తే కనీసం టాప్-5 లో ఉంటుంది కానీ ఇలా పృథ్వీ వెనకాలే తిరగడం చూసే ఆడియన్స్ కి చిరాకుగా ఉంది. ఇక యష్మీ టార్గెట్ చేసే వారి లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్న మొన్నటి దాకా మణికంఠని ప్రతీ వారం నామినేషన్ చేస్తూ ఓ శత్రువులా చూసిన యష్మీ.. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని మీద‌ పడి ఏడుస్తుంది. అయితే బిగ్ బాస్ మామ తను మాట్లాడిన నెగెటివ్ మాటలని ట్రిమ్ చేసి లేపేశాడు. అయితే బిబి ఆడియన్స్ దీనిని కట్ చేసి సోషల్ మీడియాలో‌ పోస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే పృథ్వీ, యష్మీ గౌడ, విష్ణుప్రియ ఒక దగ్గర మాట్లాడుకుంటన్నారు. నయని పావని.. ఉదయాన్నే లేచి బాగా రెడీ అయ్యి.. డాన్స్ చేసింది. ఫుల్ మేకప్ అయ్యింది.. ఆమె రాత్రి కూడా మేకప్ వేసుకుంటుందేమో.. లేదంటే నిన్న వేసిన మేకప్ తీయలేదేమోనని పృథ్వీ వెటకారంగా అనగా.. ఏంటీ ఆమె మేకప్ తీయలేదా.. మేకప్ తీస్తే చూడలేం అనుకో అని యష్మీ ఆమె స్కిన్ గురించి నీఛంగా మాట్లాడింది. కలర్ బాలేదని , అదీ అమ్మాయిని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది యష్మీకే తెలుసు. అయితే ఇదంతా చూసే ఆడియన్స్ కు మాత్రం కరెక్ట్ అనిపించలేదు‌.. అందుకే యష్మీ ఇలా బాడీ షేమింగ్ చేసిందంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్.. వాడు మేకప్ వేసుకోకపోయిన దొంగలాగే ఉంటాడని అనడంతో పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. మరి యష్మీ ఇలా ఒపెన్ గా నయని పావని బాడీ కలర్ గురించి మాట్లాడటాన్ని బిగ్ బాస్ ఎలా వదిలేశారో ఏంటో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.