English | Telugu

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది.

మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ కి మినిస్టర్ సూర్య ప్రతాప్ వస్తాడు. తనని అందరు ఆహ్వానిస్తారు. వీరూని చూసి ఈ మధ్య రాజకీయాల్లో బాగా వినిపిస్తున్నావని మినిస్టర్ అనగానే అవును ఆయన తర్వాత తన లెగసీనీ కంటిన్యూ చేస్తాడని వీరు గురించి మినిస్టర్ కి చెప్తుంది శకుంతల. తనకంటే రుద్ర కంటిన్యూ చేస్తే బాగుంటుందని మినిస్టర్ అనగానే వీరుకి కోపం వస్తుంది. అప్పుడే రుద్ర వస్తాడు. మీ వైఫ్ ఛాంపియన్ ఎక్కడ అని అడుగుతాడు. తను ప్రాక్టీస్ లో ఉందని అక్కడున్న వాళ్లు కవర్ చేస్తారు. ఆ తర్వాత గంగ కిందపడిపోతుంది అప్పుడే రుద్ర వచ్చి.. లేమ్మా చూసుకోవాలి కదా అని అంటాడు. అప్పుడే వంశీ, సూర్య వస్తారు. ఆవిడని చూస్తుంటే గంగని చూసినట్లు అనిపిస్తుందని వంశీ అంటాడు. అదొక తింగరిది.. ఇక్కడ ఉంటే ఈ ఫుడ్ అంతా ఒక్కతే తినేదని రుద్ర అంటుంటే గంగకి కోపం వస్తుంది.

ఆ తర్వాత వీరు మనుషులు ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చి వంటల్లో విషం కలుపుతారు. గంగ చూసి ఏం చేస్తున్నారని అడుగుతుంది. అతను ఏదో కవర్ చేస్తాడు. అతనిపై గంగకి డౌట్ వస్తుంది. అతను ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతాడు. స్టాల్ లో ఉన్న ఫుడ్ లో విషం కలిపామని అతను ఫోన్ లో చెప్పడం గంగ విని షాక్ అవుతుంది. మరొకవైపు సూర్య ప్రతాప్ అన్ని ఫుడ్ స్టాల్ తిరుగుతూ ఫుడ్ టేస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.