English | Telugu

Karthika Deepam2 :  సుమిత్ర కోసం జ్యోత్స్న పెళ్ళికి రెడీ.. మరి సీఊఓ ఎవరు!


స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -509 లో.. జ్యోత్స్న పట్ల సుమిత్ర తన నిర్ణయం చెప్తుంది. నా కూతురిని నేను పెళ్లి కూతురిగా చూడాలని అనుకుంటున్నానని చెప్పగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అత్త భలే ట్విస్ట్ ఇచ్చిందని దీపతో కార్తీక్ చెప్తాడు. ఒకసారి సీఈఓ గురించి ఆలోచించండి అని శివన్నారాయణతో పారిజాతం అనగానే.. ఆలోచిస్తాను., ఇప్పుడు కాదు బోర్డు మీటింగ్ లో అని శివన్నారాయణ అంటాడు.

ఆ తర్వాత ఇలా చేస్తే పని అవనప్పుడు శత్రువు దగ్గరికి వెళ్లి కాకా పట్టాలని పారిజాతం అంటుంది. దాంతో కిచెన్ లో ఉన్న దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్లి.. నువ్వు నాకొక హెల్ప్ చెయ్యాలి.. సీఈఓగా నాకు సపోర్ట్ చెయ్యమని బావకి నువ్వు చెప్పాలి.. అలా చేస్తే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. అయినా మా బావ నా మాటేందుకు వింటాడని దీప అంటుంది. అలా అనకు దీప నాకు ఎవరు సపోర్ట్ లేరని జ్యోత్స్న ఏడుస్తున్నట్లు యాక్టింగ్ చేస్తుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి హెల్ప్ చెయ్ అని చెప్పి వెళ్తుంది.

ఆ తర్వాత అందరు బోర్డు మీటింగ్ కి వెళ్తారు. బావ నీతో మాట్లాడాలి అని జ్యోత్స్న బయటే కార్తీక్ ని ఆపుతుంది. నాకూ హెల్ప్ చెయ్యాలని అడుగుతుంది. నువ్వు నా భార్యతో బేరం మాట్లాడడం చూసానని కార్తీక్ అంటాడు.‌సపోర్ట్ చెయ్యనని కార్తీక్ చెప్తాడు. కోపంగా జ్యోత్స్న లోపలికి వెళ్తుంది. బోర్డు మీటింగ్ లో అందరూ జ్యోత్స్న సీఈఓగా వద్దని చెప్తారు. నేను మీ నిర్ణయం అంగీకరిస్తున్నాను కానీ కొత్త సీఈఓ ఎవరని జ్యోత్స్న అడుగుతుంది. కార్తీక్ ని శివన్నారాయణ పిలుస్తాడు. నో డౌట్ కచ్చితంగా బావనే సీఈఓ చేస్తారు ఎలాగైనా దీన్ని ఆపాలని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.