English | Telugu

క్యాన్సర్ పేషెంట్‌కు 'బిగ్ బాస్' రెమ్యునరేషన్ డొనేషన్!

నోరు మంచిదయితే ఊరు మంచిది అవుతుందని పెద్దలు అంటుంటారు. 'బిగ్ బాస్'లో రెండో వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి, హౌస్‌లో నోరు పారేసుకున్నారని వీక్షకులు విమర్శించారు. ఎవరైతే తనకు విమర్శించారో... వాళ్ళ చేత ప్రశంసలు అందుకుంటున్నారామె! ఉమాదేవి చేసిన పనికి నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు. చాలామంచి పని చేసిందని చెబుతున్నారు. ఇంతకీ, ఆమె ఏం చేసిందంటే...

'బిగ్ బాస్' హౌస్‌లో రెండు వారాలు ఉమాదేవి ఉన్నారు. అందుకు రెమ్యునరేషన్ అందుకున్నారు. అందులో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్సకు సాయంగా అందజేశారు. దాంతో ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఉమాదేవి మనసు మంచిదని పొగుడుతున్నారు. షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె మళ్ళీ ఎంట్రీ ఇస్తే బావుంటుందని కొందరు అంటుండటం విశేషం.

'బిగ్ బాస్'కు వెళ్ళడానికి ముందు ఉమాదేవి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించారు. అయితే, వాటి కంటే ఈ షోలో పార్టిసిపేట్ చెయ్యడం ద్వారా, ఆ తర్వాత డొనేషన్ ఇవ్వడం ద్వారా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.