English | Telugu

Karthika Deepam 2: క్షేమంగా ఉన్న సుమిత్ర.. శివన్నారాయణకి ఎందుకు తెలియొద్దంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -492 లో... దీప ఫోన్ చేయగానే కార్తీక్ కంగారుగా వస్తాడు. ఇంట్లో సుమిత్రని చూసి కార్తీక్ షాక్ అవుతాడు. దీప జరిగింది మొత్తం చెప్తుంది. అక్కడ తాత వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తానని కార్తీక్ అంటే దీప వద్దని ఆపుతుంది. సుమిత్ర కోపంగా తనతో అన్న మాటలు చెప్తుంది. నేను ఆ ఇంటికి వెళ్లను అంది.. ఇప్పుడు స్పృహలోకి వచ్చి మళ్ళీ ఏమైనా అంటుందేమోనని దీప అంటుంది.

ఆ తర్వాత కాంచన, శ్రీధర్ ఇంటికి వస్తారు. నాన్న వచ్చినట్లు ఉన్నాడు తనకి అత్త ఇక్కడ ఉన్నట్లు తెలియొద్దని వాళ్లు లోపలికి రాకుండా ఆపుతారు. నేను ఇంట్లోకి రావడం ఇష్టం లేదా అని శ్రీధర్ అంటాడు. అలా కాదు ఇంటిదగ్గర పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తారు కదా.. వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా అని శ్రీధర్ ని ఇంటికి పంపిస్తాడు కార్తీక్. కాంచన లోపలికి వచ్చాక సుమిత్ర ఉన్న విషయం చెప్తారు. సుమిత్రని చూసి కాంచన బాధపడుతుంది.

అప్పుడే జ్యోత్స్న ఫోన్ చేసి మా అమ్మ గురించి తెలిసిందా అని అడుగుతుంది. అత్త క్షేమంగా ఉందని కార్తీక్ అనగానే మమ్మీ ఎక్కడ ఉందో తెలిసిందా అని జ్యోత్స్న అంటుంది. లేదు క్షేమంగా ఉంటుందని అంటున్నానని కార్తీక్ అంటాడు. మరొకవైపు శ్రీధర్ ఇంటికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. దాంతో దాసు, కాశీ ఇద్దరు సుమిత్ర ని వెతకడానికి వెళ్తారు. శ్రీధర్ కూడా సుమిత్ర కోసం వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.