English | Telugu

Illu Illalu Pillalu: ముద్దు పెట్టాడని అరిచేసిన శ్రీవల్లి.. గాలి తీసిన నర్మద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -293 లో.. ధీరజ్ కి ప్రేమ అన్నం తినిపిస్తుంది. మరొకవైపు సాగర్ ఇల్లరికం గురించి నర్మద వాళ్ళ నాన్న మాట్లాడడంతో రామరాజు బాధపడతాడు. నా కుటుంబం అంటే చాలా ఇష్టం.. అందరం ఎప్పుడు కలిసే ఉండాలని వేదవతితో రామరాజు చెప్తూ ఎమోషనల్ అవుతాడు.

మరొకవైపు నీ హ్యాపీనెస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను.. కానీ, నేను మీ ఇంటికి వెళ్లినందుకు మా నాన్నకి సారీ చెప్పావంటే.. నేను చేసింది తప్పు అని అనుకుంటున్నావని నర్మదపై సాగర్ కోప్పడుతాడు. దాంతో సాగర్ కి నర్మద ముద్దు పెడుతుంది. సాగర్ కూల్ అవుతాడు.

మరుసటిరోజు శ్రీవల్లి ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే విశ్వ పిలిచి అమూల్యని అలా పక్కకి తీసుకొని రా అంటాడు. నేను తీసుకొని రానని శ్రీవల్లి అంటుంది. పది లక్షలు ఇచ్చింది రాయబారం నడపడానికే అని భద్రవతి అంటుంది. శ్రీవల్లి సరే అని వెళ్లిపోతుంటే.. నర్మద ఎదురుపడి వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నావని అడుగుతుంది. వాళ్ళని మన జోలికి రావొద్దని తిడుతున్నానని శ్రీవల్లి చెప్తుంది.

ఆ తర్వాత చందు దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది. ఇప్పుడు అంతా సెట్ అయింది కదా నాతో బాగుండొచ్చు కదా అని శ్రీవల్లి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. చందు తనకి ముద్దుపెడతాడు. దాంతో మా అయన నాకు ముద్దు పెట్టాడని గట్టిగా అరుస్తుంది శ్రీవల్లి. దాంతో అందరు వస్తారు. ఎందుకు అలా అరుస్తున్నావ్ నిన్న మా ఆయన పెట్టాడు.. మావయ్య కూడా అత్తయ్యకి ఎన్నో సార్లు పెట్టాడు.. మొన్న ధీరజ్ కూడా ప్రేమకి ముద్దు పెట్టాడు.. మేం ఇలాగే అరుస్తున్నామా అని నర్మద అంటుంది.

తరువాయి భాగంలో ధీరజ్ క్యాబ్ డ్రైవర్ గా వెళ్తుంటే.. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది.. ఈ రోజు వద్దు అని ప్రేమ అంటున్నా కూడా ధీరజ్ వెళ్తుంటే ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.