English | Telugu

జబర్దస్త్ రాకేష్, సుజాతల దంపతులకి పాప పుట్టింది.. నాన్న ఎమోషనల్ పోస్ట్!

జబర్దస్త్ రాకేష్ తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. జోర్ధార్ సుజాత ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇద్దరు తమ ప్రొఫెషన్స్ తో ఎప్పుడు బిజీగా ఉంటారు.

ఇద్దరికి వేరువేరు యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయ్. అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న జబర్దస్త్ రాకేష్- సుజాత దంపతులు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ చెప్పారు.‌ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన వీరిద్దరే.. అసలేం విషయం ఏంటంటే.. వారిద్దరికి పాప పుట్టింది. ఇదే విషయాన్ని చెప్తూ.. తన భార్య, పాపతో ఉన్న ఓ ఫోటోని రిలీజ్ చేశాడు. ఈ పోస్ట్ లో రాకేశ్ ఏం రాశాడంటే.. ఈ నవరాత్రి పర్వదినాలలో మా‌ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. హాస్పిటల్లో నేను అనుభవించిన ఆ సంఘటన ఓ అద్భుతం.. మా అమ్మని ఎంతో బాధపెడుతూ ఈ లోకంలోకి వచ్చిమ నేను ప్రత్యేక్షంగా ఆ బాధను చూస్తూ తండ్రినయ్యాను. ఈ జన్మలో ఏ బాధ నిన్ను దరిచేరనివ్వమ్మా అని రాకేశ్ రాసుకొచ్చాడు.

నా బాధలో నా ఆనందంలో సగమైన నా సుజాత ఓ బిడ్డకి తల్లిగా.. నా కుటుంబానికి మరో అమ్మగా పరిపూర్ణ స్త్రీగా మారిన ఓ అద్భుత క్షణం ఆ దేవుడు ఆశీస్సులతో త్వరగా కోల్కొని నీ షూటింగ్లలో బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను సుజాతని మొదటి నుండి మీ ఆశీస్సులతో పాజిటివ్ ఎనర్జీతో ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు. ఇలాగే మీ ఆశీస్సులు మా పాప మీద కూడా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని రాకేశ్ చెప్పుకొచ్చాడు. ‌ జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రాకేశ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.