English | Telugu

Jayam serial : ఎటాక్ ఎందుకు చేస్తున్నావని సైదులుని అడిగిన రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -66 లో..... గంగ కలవాలనుకున్న రాజకుమారుడు రుద్ర ఒక్కరే అని గంగ మురిసిపోతుంది. రుద్ర మీటింగ్ లో మాట్లాడుతుంటే.. గంగ అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత చిన్నితో రుద్ర మాట్లాడుతాడు. ఏంటి డల్ గా ఉన్నావని రుద్ర అడుగుతాడు. నా ఫ్రెండ్ ఇంకా రాలేదని చెప్తుంది. వాళ్ళ మాటలన్నీ గంగ చాటుగా ఉండి వింటుంది.

ఆ తర్వాత రుద్ర దగ్గరికి గంగ వస్తుంది. నీ ఫ్రెండ్ ని కలిసావా అని అడుగుతాడు. కలిసాను మళ్ళీ కలిసి వస్తాను.. ఫోన్ నెంబర్ ఇస్తాను అందని గంగ అంటుంది. మరొకవైపు గంగ కోసం తీసుకొని వచ్చిన కేక్ లో ఇషిక ఏదో కలుపుతుంది కానీ ఆ కేక్ ని కాకుండా వేరే కేక్ ని గంగ కట్ చేసింది కాబట్టి ఆ కేక్ ని ఇషిక బయట పారేస్తుంది ఆ కేక్ తిని కుక్క చనిపోతుంది. అది ఇంట్లో అందరు చూసి షాక్ అవుతారు. అసలు ఈ కేక్ ఎవరు తీసుకొని వచ్చారని పెద్దసారు అడుగుతాడు. మీరే తీసుకొని వచ్చారని చెప్పండి అని ఇషిక అనగానే నేనే తీసుకొని వచ్చానని ఇందుమతి చెప్తుంది. మరి అది ఎక్కడ నుండి తీసుకొని వచ్చావ్.. అందులో ఏదో కలిపారు.. ఈ విషయం లైట్ తీసుకోవద్దు.. వీరు నువ్వు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా అని పెద్దసారు చెప్పగానే వీరు వెళ్తాడు.

మరొకవైపు పోలీస్ స్టేషన్ కి గంగ, రుద్ర వెళ్తారు. అప్పుడే వీరు వస్తాడు. వీరు ఇంట్లో జరిగింది మొత్తం రుద్రకి చెప్తాడు. మావయ్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నాడు. అందుకే వచ్చానని వీరు చెప్తాడు. ఆ తర్వాత రుద్ర సైదులు దగ్గరికి వెళ్లి.. నువ్వు ఎందుకు మాపై ఎటాక్ చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. సైదులు సైలెంట్ గా ఉంటాడు. అక్కడే వీరు ఉంటాడు.. సైలెంట్ గా చెప్పొద్దని సైగ చేస్తాడు. ఇలాంటి వాళ్ళు నిజం చెప్పరని రుద్రతో ఇన్ స్పెక్టర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.