English | Telugu

Jayam serial : పూజలో గంగ తల్లికి అవమానం.. వీరు మాటలని పెద్దసారు వినేశాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -133 లో.. రుద్ర, గంగలచే సత్యనారాయణ వ్రతం చేయించడానికి పెద్దసారు ఏర్పాట్లు చేస్తాడు. ఇక ఇషిక ప్రసాదం మార్చి శకుంతలచే గంగని తిట్టేలా చేస్తుంది. పూజకి పారు కూడా వస్తుంది. గంగని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళు వచ్చి.. గంగని తిడుతుంటే నేను ఒప్పుకోనని రుద్ర అంటాడు. గంగకి సారీ చెప్పమని పారుతో రుద్ర అంటాడు.

దాంతో గంగకి సారీ చెప్తుంది పారు. అమ్మాయి పుట్టింటివాళ్ళని పిల్వలేదు పంతులు అని పెద్దసారు చెప్తారు. పర్లేదు అన్నయ్య వరుస అయ్యే వారితో బట్టలు పెట్టించండి అని పంతులు అనగానే వీరు అన్నయ్య ఉన్నాడు కదా అని ప్రమీల అంటుంది. అవును రా వీరు అని పెద్దసారు అంటాడు. అప్పుడే శ్రీనన్న వస్తాడు. ఇంట్లో పూజ అని తెలిసి బట్టలు తీసుకొని వచ్చానని చెప్పగానే గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూజ అయ్యాక గంగ వెళ్తుంటే పడిపోతుంది. దాంతో గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ తనని పట్టుకుంటుంది. అప్పుడే గంగ చూసి.. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. తనని చూసి అందరు షాక్ అవుతారు. లక్ష్మీని పనిమనిషి అని తీసుకొని వస్తావా అని ఇషికపై పెద్దసారు కోప్పడతాడు. నాకు తెలియదు మావయ్య అని ఇషిక అంటుంది.

అమ్మ మందుల కోసం పనికి వెళ్తున్నావా అని గంగ బాధపడుతుంది. లక్ష్మీని శకుంతల అవమానిస్తుంది. ఆ తర్వాత లక్ష్మి ఇంటికి వెళ్ళాక శ్రీనుకి డబ్బులు ఇస్తుంటే పైడిరాజు వచ్చి లాక్కుంటాడు. కూతురికి పంపాల్సినవి అన్నీ పంపిస్తున్నావా అని కోప్పడుతాడు. మరొకవైపు గంగ దగ్గరికి వీరు వచ్చి మాట్లాడతాడు. నువ్వేంటో తెలిసినప్పుడు అమ్మగారు నిన్ను బయటకు గెంటెస్తారని గంగ అంటుంటే తనపై వీరు కోప్పడుతాడు. అప్పుడే పెద్దసారు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.