English | Telugu

Jayam serial : శకుంతల చేయించిన నగలు వేసుకున్న గంగ.. చెంప చెల్లుమంది కదా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -136 లో.....గంగని మేలిముసుగులో తీసుకొని వచ్చి తనకి సారే పెడుతుంటే అందులో రుద్ర గ్లౌజ్ కూడా పెడతాడు. దాంతో శకుంతల వద్దని అంటుంది. అది కూడా నాకు సారె అని భావించి సర్ ఇస్తున్నాడని గంగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా నచ్చక శకుంతల అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరుసటిరోజు రుద్ర జాగింగ్ కి రెడీ అవుతుంటే గంగ చద్దన్నం తింటూ ఉంటుంది.

ఏంటి ఇదంతా ఇంత ప్రొద్దున తింటున్నావ్.. రన్నింగ్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారని రుద్ర అనగానే నిన్న జరిగిన దానికి రాత్రి సరిగ్గా తినలేదు.. అందుకే అని గంగ అంటుంది. మీరు తినండి అని తనకి గంగ తినపెట్టినట్లు మిర్చి తిన్న రుద్రకి కారం అవుతుంటే రుద్రకి లిప్ టూ లిప్ కిస్ పెట్టినట్లు గంగ ఉహించుకుంటుంది. మరొకవైపు పారు కోసం అత్తయ్య నగలు చేయించింది.. ఆ నగలు గంగ వేసుకునేలా చేస్తే తనకి కోపం వస్తుందని ఇషిక, వీరు ప్లాన్ చేస్తారు. గంగ దగ్గరికి ఇషిక వెళ్లి అత్తయ్య నిన్ను కోడలిగా ఒప్పుకోవాలంటే తనకి నచ్చినట్టు ఉండాలంటే ఈ నగలు వేసుకోవాలని ఇషిక చెప్పగానే గంగ వేసుకుంటుంది. ఆ తర్వాత అందరు చీరలు సెలెక్ట్ చేసుకోండి పారుని కూడ పిలిచానని శకుంతల ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. అప్పుడే పారు ఎంట్రీ ఇస్తుంది. అత్తయ్య అని గంగ నగలు వేసుకొని వస్తుంది అందరు తనని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ శకుంతల వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది.

ఎందుకు ఈ నగలు వేసుకున్నావని రుద్ర అడుగుతాడు. ఇంకా అర్థం కాలేదా తనకి నగలు కావాలని పారు అంటుంది. అత్తయ్యకి నచ్చినట్టు ఉంటే తనకి నచ్చుతానని గంగ అనగానే అది ఎప్పటికి జరగదని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.