English | Telugu
Illu illalu pillalu : దొంగతనం ఎవరు చేశారని ఆరా తీసిన రామరాజు.. టెన్షన్ లో ఆనందరావు!
Updated : Sep 5, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -255 లో.....తిరుపతి ఉదయం నిద్రలేచేసరికి తన చేతికి ఉండాల్సిన కలశం ఉండదు.. నా చెయ్ ఫ్రీగా ఉందని తిరుపతి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో అందరిని పిలిచి ఆ విషయం చెప్తాడు. మరి ఆ కలశంలోని నగలు ఏవని రామరాజు అడుగుతాడు. ఏమోనని తిరుపతి అనగానే రామరాజు తనపై కోప్పడతాడు.
నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా అతను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు.. ఆ కలశంతో పాటు నగలు కూడా ఎక్కడో పోయినట్లు ఉన్నాయని ఆనందరావు అనగానే బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా.. మాట్లాడితే నమ్మేలా ఉండాలని రామరాజు అంటాడు. ఆ తర్వాత అందరు కలిసి ఆ కలశం ఎక్కడుందో వెతుకుతారు. ప్రేమకి అప్పుడే కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది.. అది చూసి ప్రేమ కాలు పట్టుకొని ముళ్ళు తీస్తాడు ధీరజ్.
మరొకవైపు నర్మదని సాగర్ ఎత్తుకొని గోడకి అటువైపు కలశం ఉందేమోనని చూడమని చెప్తాడు. నర్మదని ఎత్తుకొని సాగర్ రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత అందరు లోపలికి వస్తారు. నాకు ఈ దొంగతనం వెనక చాలా అనుమానాలున్నాయి. అసలు కలశంలో నగలున్నట్లు శ్రీవల్లి వాళ్ళ అమ్మనాన్నకి మన కుటుంబానికి మాత్రమే తెలుసు కదా.. దొంగ ఇంట్లో ఏది పట్టుకుపోకుండా కేవలం ఆ కలశం తీసుకొని వెళ్ళాడంటే నాకు డౌట్ గా ఉందని రామరాజు అనగానే ఆనందరావు టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.