English | Telugu
Illu illalu pillalu : భాగ్యాన్ని రప్పించిన నర్మద, ప్రేమ.. వాళ్ళ అడ్రెస్ కనుక్కుంటారా!
Updated : Aug 3, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -227 లో... నర్మద చేతిలో ఉన్న ఉప్మా ప్లేట్ ని తీసుకొని తింటుంది శ్రీవల్లి. అయ్యో వల్లి అక్క అందులో బొద్దింక పడిందని ప్రేమ, నర్మద చెప్పగానే.. అమ్మో అని శ్రీవల్లి వాంతింగ్ చేసుకుంటుంది. అది చూసి ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న అందరిని పిలుస్తారు. వేదవతి రాగానే.. అత్తయ్య మీ పెద్దకోడలు నెల తప్పిందని ప్రేమ, నర్మద చెప్తారు. దాంతో వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.
రామరాజు వచ్చి నన్ను తాతయ్యని చేస్తున్నందుకు హ్యాపీగా ఉందని అంటాడు. అత్తయ్య హడావిడిలో వల్లి అక్క పేరెంట్స్ కి చెప్పడం మర్చిపోయారని నర్మద అంటుంది. అది కాదు అత్తయ్య అని శ్రీవల్లి చెప్పబోతుంటే.. అసలు తనని ప్రేమ, నర్మద మాట్లాడనివ్వరు. కాసేపటికి భాగ్యం కి ఫోన్ చేస్తుంది వేదవతి. నీ కూతురు నెల తప్పిందని చెప్పగానే భాగ్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే బయల్దేరి శ్రీవల్లి దగ్గరికి వచ్చేస్తారు. నేను నెల తప్పలేదు.. బొద్దింక పడ్డ ఉప్మా తిని వాంతింగ్ చేసుకున్నానని శ్రీవల్లి చెప్పగానే అందరు డిజప్పాయింట్ అవుతారు.
నర్మద, ప్రేమ వాళ్ళే అది ఇచ్చారని వల్లి చెప్తుంటే.. మేం అదే ఉప్మా తిన్నాం.. మాకేం కాలేదని ప్రేమ అంటుంది. ఇంకా ఎక్కువసేపు ఉంటే చందు ఎక్కడ డబ్బు అడుగుతాడోనని భాగ్యం తన భర్తని తీసుకొని వెళ్లిపోతుంటే భాగ్యంకి నర్మద, ప్రేమ ఎదురుపడి వార్నింగ్ ఇస్తారు. భాగ్యం తన భర్త వెళ్తుంటే ప్రేమ, నర్మద వెనకాలే వెళ్తారు. తరువాయి భాగంలో వాళ్ళు ఫాలో అవుతున్న విషయం భాగ్యం చూసి వాళ్లకు కనిపించకుండా దాక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.