English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి చేతికి ఇంటికి తాళాలు అప్పగించిన రామరాజు.. పెత్తనం మొదలైందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -217 లో......రామరాజు మిల్ కి వెళ్తుంటే వేదవతి వచ్చి ఈ మధ్య మీకు మతిమరుపు ఎక్కువైంది.. వెళ్ళేటప్పుడు నా చేత్తో బ్యాగ్, మిల్ తాళాలు ఇస్తాను కదా అని వేదవతి అంటుంది. కానీ శ్రీవల్లిని పిలిచి బ్యాగ్, తాళాలు తీసుకొని రా అని అంటాడు రామరాజు. దాంతో అందరు షాక్ అవుతారు. ఎప్పుడు నేను ఇస్తాను కదా నా సెంటిమెంట్ ఎందుకు దూరం చేస్తున్నారని వేదవతి బాధపడుతుంది.

అంతే కాకుండా నేనొక నిర్ణయం తీసుకున్నానని రామరాజు ఇంటిలోపలికి వెళ్ళి తాళాలు తీసుకొని వస్తాడు. ఇక ఈ ఇంట్లో పెత్తనం మొత్తం శ్రీవల్లిదే..నా తర్వాత ఇంటిని బాగా నడిపిస్తుందన్న నమ్మకం నాకుంది.. ఇదిగో అమ్మ తాళాలు అని శ్రీవల్లితో రామరాజు అంటుంటే.. మావయ్య గారు వద్దు... ఇన్ని సంవత్సరాల నుండి అత్తయ్య గారు కుటుంబాన్ని బాగా నడిపారని ప్రేమ, నర్మద అడ్డు చెప్తారు. మీరు నాతో డైరెక్ట్ మాట్లాడకండి..ఏదైనా చెప్పాలంటే శ్రీవల్లికి చెప్పండి తను నాతో చెప్తుందని ప్రేమ, నర్మదలతో రామరాజు అంటాడు. శ్రీవల్లి రామరాజు దగ్గర తాళాలు తీసుకొని బుల్లెట్ బండిపై తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ భాగ్యంకి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో భాగ్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత ప్రేమ, నర్మద నడుచుకుంటూ వెళ్తారు. ఆ శ్రీవల్లి వాళ్ల బండారం బయటపెడితే బాగుండు అని అనుకుంటారు. అప్పుడే ధీరజ్ అటుగా వెళ్తాడు. ప్రేమ పలకరించినా మాట్లాడడు. ఆ తర్వాత సాగర్ వెళ్తు నర్మదతో మాట్లాడడు. తరువాయి భాగంలో ప్రేమ నిద్రపోతుంటే శ్రీవల్లి వచ్చి తన మొహంపై నీళ్లు కొడుతుంది. ఏంటి ఇది నీ పుట్టిల్లు అనుకున్నావా.. నువ్వు రేపటి నుండి అయిదింటికి లేచి పనులు చెయ్యాలని శ్రీవల్లి ఆర్డర్ వేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.