English | Telugu

Illu illalu pillalu : ప్రేమించిన అమ్మాయితో లేచిపోడానికి కొడుకు ప్లాన్.. నాన్న గుర్తించగలడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -21 లో....వేదవతి ఏడుస్తుంటే ప్రేమ చూస్తుంది. నీ కూతురు ఏడుస్తుందని వాళ్ళ నానమ్మకి చెప్తుంది. దాంతో తను తన కూతురు దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతుంది. నా కొడుకులు సంతోషంగా లేరని బాధపడుతుంది వేదవతి. నిన్ను బంగారంలా చూసుకునే నీ భర్త ఉండగా.. నీకు ఎందుకు బాధ అంటూ వాళ్ళ అమ్మ దైర్యం చెప్తుంది.

అదంతా ప్రేమ చూస్తుంది. అప్పుడే ధీరజ్ కూడా వస్తాడు. ధీరజ్ , ప్రేమ లు ఒకరినొకరు చూసుకొని చిరాకు పడుతారు. ధీరజ్ దగ్గర ప్రేమ ఫోన్ తీసుకొని కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మరొక వైపు నర్మద సాగర్ ని కలిసి మాట్లాడుతుంది. మీ అమ్మ, నాన్న నీ తీసుకొని రమ్మంటే నువ్వు మీ తమ్ముడు వచ్చారని కోప్పడుతుంది. మా వాళ్లని ఎదురించి అయిన సరే నిన్ను పెళ్లి చేసుకుంటా.. నువ్వు అలా రాగలవా అని నర్మద అనగానే సాగర్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేమ రాత్రి వస్తుంటే తను స్కూటీ పాడవుతుంది. అప్పుడే రామరాజు వెళ్తు.. ప్రేమ దగ్గర ఆగి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అదంతా వాళ్ళ బాబాయ్ చూసి బావ ఎంత మంచోడు.. నువ్వు శత్రువు కూతురు అయినా సరే వదిలెయ్యకుండా తీసుకొని వచ్చాడని ప్రేమతో అంటాడు.

మరొకవైపు సాగర్, నర్మద మాటలు గుర్తుచేసుకుంటాడు. నర్మద ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యడు. డైరెక్ట్ ఇంటికి వచ్చినా వస్తుందని ధీరజ్ అంటాడు. నిజంగానే నర్మద ఇంటి ముందు ఉంటుంది. అది చూసి సాగర్ త్వరగా బయటకు వెళ్తాడు. ఇక్కడ నుండి వెళ్ళు అంటాడు. నాకు సమాధానం చెప్పే వరకు వెళ్ళనని నర్మద అంటుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ని తీసుకొని ధీరజ్ ఇంట్లో నుండి వచ్చేస్తాడు. నర్మద ఇంటి ముందు ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.