English | Telugu
Illu illalu pillalu : ప్రేమ పెళ్ళిళ్లు చేసుకోవద్దన్న రామరాజు.. భాగ్యం, శ్రీవల్లి హ్యాపీ!
Updated : Jul 16, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -211 లో......ఎందుకిలా మాకు ఎవరికి చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ కి వెళ్లావని వేదవతి ప్రేమపై కోప్పడుతుంది. ఎందుకంటే ధీరజ్ కోసమని ప్రేమ అనగానే అందరు షాక్ అవుతారు. అవును నా కోసం పగలు రాత్రి తేడా లేకుండా సైకిల్ పై ఫుడ్ డెలివరి చేస్తూ కష్టపడుతున్నాడు. తనకి సాయం గా ఉండాలని చేసాను. అది అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడతారేంటని ప్రేమ అంటుంది.
మావయ్య గారికి తెలియకుండా చేసిందే కాకుండా ఇంకా ఇలా మాట్లాడతావ అని శ్రీవల్లి కలుగజేసుకొని ప్రేమని నెగెటివ్ చెయ్యాలని చూస్తుంది. ఆ తర్వాత రామరాజు కలుగుజేసుకొని ఆపండి ఇందుకేరా.. మిమ్మల్ని ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవద్దనేది అని రామరాజు బాధగా లోపలకి వెళ్తుంటాడు. ధీరజ్ ఇచ్చిన షర్ట్ చిరిగిపోవడంతో షర్ట్ విప్పి ధీరజ్ మొహంపై విసిరేస్తాడు.
ఆ తర్వాత శ్రీవల్లి జరిగిన దానికి హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ల అమ్మ భాగ్యానికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. అది విని భాగ్యం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఎందుకు ప్రతీసారి వాళ్ల కుటుంబంతో గొడవ పెట్టుకుంటున్నారు.. పెళ్లి చేసుకొని దాని జీవితం అది బ్రతుకుతుంది కదా అని సేనాపతితో రేవతితో అంటుంది. అది అక్కడ కష్టపడుతుందని సేనాపతి కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.