English | Telugu
Illu illalu pillalu : పెళ్ళి సంబంధం చెడగొట్టిన భద్రవతి.. రామరాజుని అరెస్ట్ చేసిన పోలీసులు!
Updated : Feb 18, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -85 లో.....తిరుపతి ఫోన్ చేయగానే ధీరజ్, ప్రేమ, సాగర్, నర్మదలు ఇంటికి వస్తారు. ఆ అమ్మాయి నగలు నువ్వు తీసుకొని వచ్చావా అంటూ ధీరజ్ పై రామరాజు విరుచుకుపడతాడు. దాంతో ప్రేమ ధీరజ్ లు టెన్షన్ పడతారు. నగలు తీసుకొని రాలేదంటే ఎక్కడ ప్రేమ విషయం బయటపడుతుందోనని తీసుకన్నానని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. వాళ్ళ నగలు వాళ్లకి ఇచ్చేయ్ అని రామరాజు అంటాడు. దాంతో నగలు లేవు పెళ్లికి ఖర్చు అయ్యాయంటూ అబద్ధం చెప్తాడు ధీరజ్.
దాంతో ధీరజ్ పై రామరాజు కోప్పడతాడు. ఆ నగల విలువ ఎంత ఉంటుందో చెప్పు ఇస్తానని రామరాజు అనగానే.. ఒరేయ్ మాకే డబ్బులు ఇస్తానని అంటావా అని సేనాపతి, విశ్వలు గొడవకి వెళ్తారు. దాంతో వద్దని వాళ్ళిద్దరిని లోపలికి పిలుస్తుంది భద్రవతి. ప్రేమని ధీరజ్ పక్కకి తీసుకొని వెళ్లి.. నీ వల్లే ఇదంతా అని కోప్పడతాడు. మరొకవైపు మా అక్క అంత సైలెంట్ గా ఉందంటే ఏదో సమస్య చేయబోతుందని నర్మదతో వేదవతితో చెప్తూ బాధపడుతుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేసావ్ అక్క ఇప్పుడు మంచి ఛాన్స్.. ప్రేమ కూడా మన ఇంటికి తిరిగి వచ్చేసేదని సేనాపతి అంటాడు. దాంతో భద్రవతి సీఐకి ఫోన్ చేసి ఫోన్ లో ఏదో చెప్తుంది. ఇప్పుడు అర్ధం అయ్యిందా నా వ్యూహం అని భద్రవతి అనగానే అర్థం అయిందంటు సేనాపతి నవ్వుతాడు.
రామరాజు రైస్ మిల్ లో ఉంటాడు. ఒకతను చందుకి ఒక సంబంధం తీసుకొని వస్తాడు. వాళ్లతో రామరాజు మాట్లాడుతుంటే.. పోలీసులు వచ్చి మీరు నగలు దొంగతనం చేశారట అని రామరాజుని అరెస్ట్ చేస్తారు. దాంతో సంబంధం వాళ్ళు మీరు ఇలాంటి వాళ్ళ అంటు రామరాజు ని తిడతారు. రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసీ స్టేషన్ కి తీసుకొని వెళ్తారు. ఆ విషయం సాగర్ కి తెలిసి అందరికి చెప్తాడు. రామరాజు స్టేషన్ కి వెళ్లేసరికి అక్కడ భద్రవతి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.