English | Telugu

Illu illalu pillalu : ఉత్సవాల్లో రెండు కుటుంబాలు.. అతడిని చంపడానికి రౌడీలని సెట్ చేసిన విశ్వ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -62 లో..... రామరాజు ఊళ్ళో తన పరువు పోయిందని సంక్రాతి ఉత్సవాలకి వద్దు అంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ తనని ఒప్పిస్తారు. ఆ తర్వాత విశ్వ తన చెల్లిని మోసం చేసి ధీరజ్ పెళ్లి చేసుకున్నాడని కోపం తో కొంతమంది రౌడీలని కలిసి దీరజ్ ఫోటో చూపించి చంపమని చెప్తాడు.

ఆ తర్వాత ఇరు కుటుంబాలు సంక్రాతి ఉత్సవాలకి వస్తారు. ఇద్దరు ఎదురు పడతారు. ప్రేమ తన పుట్టింటి వాళ్ళను చూసి బాధపడుతుంది. సేనాపతి కన్నకూతురిని చూసి ఎమోషనల్ అవుతాడు. రెండు కుటుంబాలు కలిసి వస్తుంటే ఒకతను రెండు కుటుంబాలు కలిసి పోయాయి అంటుంటే.. అది ఎప్పటికి జరగదు అని సేనాపతి అంటాడు. మరి అటు ఉండాల్సిన మీ కూతురు ఇటు ఉంది కదా అని అతను అంటుంటే.. భద్రవతికి కోపం వస్తుంది. దాంతో అతని చెంపచెల్లుమనిపిస్తుంది. అతను తిక్కతిక్కగా మాట్లాడుతుంటే.. రామరాజు కూడా అతని చెంపచెల్లుమనిపిస్తాడు.ఆ తర్వాత విశ్వ రౌడీలని సెట్ చేసి పెడతాడు.

రామరాజు కుటుంబం పూజరి దగ్గరికి వెళ్లి అర్చన చేపిస్తారు. నర్మద, సాగర్ ల పేర్లు చెప్తాడు. దాంతో మనపై కోపం పోయిందని నర్మద, సాగర్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ప్రేమ, ధీరజ్ ల పేర్లని రామరాజు చెప్పడు. దాంతో వేదవతి చూసి ప్రేమ, ధీరజ్ లా పేర్లు చెప్తుంది. తరువాయి భాగంలో మీకు ఇష్టం లేకున్నా ఇకనుండి మీరు భార్యాభర్తలు ఈ పూజ చెయ్యండి అంటూ వేదవతి దగ్గర ఉండి ప్రేమ, ధీరజ్ లచే పూజ చేయిస్తుంది. అది భద్రవతి కుటుంబం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.