English | Telugu

Illu illalu pillalu : ప్రేమని అమ్మడానికి డీలింగ్.. భద్రవతి మాస్టర్ ప్లాన్ అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -30 లో.. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి కనుక్కో వాళ్ళని అడ్డుపెట్టుకొని రామరాజు పరువుతియ్యాలని భద్రవతి అనగానే.. సేనాపతి సరే అంటాడు. దాంతో భద్రవతి అమ్మ ఆ మాటలకూ బాధపడుతుంటే ఎందుకు అమ్మ.. అది మన ఇంటి పరువు తీసింది. వాళ్ళ గురించి నువ్వు బాధపడడం ఎందుకు అంటుంది. అది కూడా నా కన్నకూతురని వాళ్ళ అమ్మ అంటుంది.

మరొకవైపు మీ నాన్నని ఎంత మోసం చేసావని సాగర్ ని వేదవతి తిడుతుంది. నన్ను క్షమించు అమ్మ అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు. నన్ను క్షమించు నాన్న అని సాగర్ అంటుంటే.. ఆ అమ్మాయి మొహం చూసి ఇంట్లోకి రానించానంతే కానీ చిన్నోడు లాగే వీడిని కూడా క్షమించలేదు.. నాతో మాట్లాడే ప్రయత్నం చేయ్యొద్దంటూ చెప్పేసి రామరాజు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ప్రేమని వేరొకరి అమ్మడానికి డీలింగ్ కుదుర్చుకుంటాడు.

ఆ తర్వాత ప్రేమ తన బాబాయ్ ని ధీరజ్ ఎక్కడ అని అడుగుతుంది. వాడు అంటే నీకు ఎంత ప్రేమ అని అతను అనగానే.. ప్రేమ కాదు.. ఏం కాదు.. నన్ను ఎప్పుడు తిడుతాడు.. అందుకే అని ప్రేమ అంటుంది. అప్పుడే ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అంటాడు. దాంతో ప్రేమ సరే అంటుంది. మరొకవైపు ప్రసాదరావు నర్మద ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడే సేనాపతిని తీసుకొని భద్రవతి వాళ్ళింటికి వస్తుంది. ఆల్రెడీ పెళ్లి అయిన అమ్మాయికి ఎంగేజ్ మెంట్ చేస్తున్నావని భద్రవతి అనగానే.. అందరూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో రామారాజు ఇంటికి ప్రసాదరావు వచ్చి తనని తిడుతుంటే.. మా నాన్నకి ఏం సంబంధం లేదని సాగర్ అంటాడు సాగర్ ని ప్రసాదరావు కొట్టబోతుంటే నర్మద అడ్డువస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.