English | Telugu
Illu illalu pillalu : భాగ్యం యాక్టింగ్...డబ్బు గురించి చందు టెన్షన్!
Updated : Aug 23, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -244 లో.....శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వెళ్లి మన బంఢారం ఆ ప్రేమ, నర్మద కచ్చితంగా బయటపెడుతారు. మీరే ఏదో ఒకటి చెయ్యండి అని శ్రీవల్లి తన పేరెంట్స్ కి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రామరాజు ఇంటికి వచ్చి సింహాద్రి చేసిన నమ్మకద్రోహం గురించి తలుచుకుంటు బాధపడతాడు. ఒకవేళ నా ఇంట్లో వాళ్ళే అలా నమ్మకంద్రోహం చేస్తే నా గుండె అక్కడే ఆగిపోయేదేమోనని రామరాజు అంటుంటే అందరు షాక్ అవుతారు.
ఇందాక ప్రేమ నువ్వు ఏదో వల్లి వాళ్ళ గురించి చెప్తున్నావ్.. ఏంటని రామరాజు అడుగుతాడు. ప్రేమ చెప్పబోతుంటే అప్పుడే భాగ్యం, ఆనందరావు ఇద్దరు వస్తారు. బావగారు అంటూ వచ్చి తన కాళ్ళపై పడిపోతారు. ఏమైందని రామరాజు అడుగుతాడు. ఫైనాన్స్ ఇచ్చి మోసపోయాం.. మా ఆస్తులు.. డబ్బు అంతా పోయిందని భాగ్యం యాక్టింగ్ చేస్తుంది. ఒక్క రోజులో ఎలా పోతాయని తిరుపతి అడుగుతాడు. మా డబ్బు ఆస్తులు పోయి వారమవుతుంది. ఈ విషయం తెలిస్తే మా అమ్మాయికి వాల్యూ ఉండదని చెప్పలేదని భాగ్యం అంటుంది. ఇందాక వీళ్ళ గురించి ఏదో చెప్పబోతున్నవ్ ఏంటి ప్రేమ అని రామరాజు అడుగుతాడు.
ప్రేమ చెప్పబోతుంటే ప్రేమని నర్మద పక్కకు తీసుకొని వెళ్లి.. ఇందాక సింహాద్రి మోసం చేస్తే ఎలా బాధపడ్డారు మావయ్య .. మళ్ళీ ఈ మోసం తెలిస్తే తట్టుకోలేడు వద్దని ఆపుతుంది. ఏం లేదు మావయ్య అని నర్మద కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఆస్తులు లేవని మిమ్మల్ని చులకనగా చూసే మెంటాలిటి కాదు లోపలికి రండి అని వాళ్ళని రామరాజు లోపలికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత మమ్మల్ని క్షమించండి అల్లుడు గారు.. మీ డబ్బు ఇవ్వనందుకు అని చందు కాళ్లపై భాగ్యం, ఆనందరావు పడి యాక్టింగ్ చేస్తుంటారు. చందుకి ఆ డబ్బు గురించి టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.