English | Telugu

Illu illalu pillalu : శ్రీవల్లి ఆ గండం నుండి తప్పించుకుంటుందా.. చందు ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -225 లో.....సాగర్ ధీరజ్ అంతా తమ భార్యల వల్లే అని కోపంగా ఉంటారు. అప్పుడే చందు వచ్చి ప్రేమ అసలు ఎందుకు అలా చేసిందో ఆలోచించావా నీపై ప్రేమతో నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావని చూడలేక అది అర్థం చేసుకోకుండా తనపై కోపం పెంచుకుంటావ్ ఏంటని ధీరజ్ పై కోప్పడతాడు చందు. వాళ్ళు తన ఫ్యామిలీని వదిలి మీతో వచ్చారు.. మీరు ఎలా చూసుకోవాలి.. మీరు అర్ధం చేసుకోకపోతే వాళ్ళకి ఎలా అనిపిస్తదని తన తమ్ముళ్ళకి క్లాస్ తీసుకుంటాడు చందు.

మరొకవైపు ఇంట్లో ఎవరు తమతో మాట్లాడడం లేదని ప్రేమ, నర్మద ఇద్దరు బాధపడతారు. ఇంతవరకు అమ్మని మిస్ అయిన ఫీలింగ్ రాలేదు కానీ మొదటిసారి అమ్మ గుర్తు వస్తుందని ఇద్దరు అనుకుంటారు. అదంతా వేదవతి విని బాధపడుతుంది. వాళ్ళ ఇద్దరి మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఏంటి మీ అమ్మ గుర్తువస్తుందా.. మరి ఇక్కడ ఉన్నదాన్ని ఏంటి దెయ్యన్నా.. ఇంకొకసారి ఇలా అంటే ఊరుకోనని వేదవతి అంటుంటే.. ప్రేమ, నర్మద ఇద్దరు వేదవతి భుజాలపై తలవాల్చి ఎమోషనల్ అవుతారు.

మరుసటిరోజు ఉదయం శ్రీవల్లి నిద్ర లేచి.. నా తాళాలు ఎక్కడ అంటూ వెతుకుతుంది. హమ్మయ్య.. ఉన్నాయ్ ఎప్పటికి ఇంట్లో పెత్తనం నాదే ఉండాలి మావయ్య గారు నేను ఏది చెప్పినా వినాలని శ్రీవల్లి బయటకు వస్తుంటే.. ప్రేమ, నర్మద వేదవతి నవ్వుతు మాట్లాడుకుంటుంటారు. వీళ్ళు ఎప్పుడు కలిసి పోయారని కళ్ళు తిరిగి పడిపోతుంది శ్రీవల్లి. వాటర్ చల్లి లేచాక మీరు కలిసిపోయారా అని శ్రీవల్లి అడుగుతుంది. వేదవతికి నర్మద సైగ చెయ్యగానే వాళ్ళతో నేనేందుకు మాట్లాడుతానని వేదవతి అంటుంది. ఆ తర్వాత సేట్ చందు దగ్గరికి వచ్చి నాకు పని చెయ్యని చెక్ ఇచ్చారు. ఈ విషయం మీ నాన్నకి చెప్తానని అంటుంటే వద్దని అతడిని రిక్వెస్ట్ చేసి పంపిస్తాడు. అదంతా నర్మద చూసి బావగారు ఏదైనా ప్రాబ్లమ్ ఆ అని అడుగుతుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఏంటి రా ఏదో టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. ఏం లేదని చందు అంటాడు. రామరాజు వెళ్ళాక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి బావ గారు అని నర్మద అడుగుతుంది. చిన్న విషయమే నేను చూసుకుంటా ఎవరితో ఈ విషయం చెప్పకని చందు అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి చందు వెళ్లి.. పనికి రాని చెక్ ఇచ్చి మోసం చేశారు.. పదా మీ ఇంటికి వెళదామని శ్రీవల్లిని చందు బయటకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.