English | Telugu

Illu illalu pillalu : భర్తకి భార్య సపోర్ట్.. ఇడ్లీలు అమ్ముతుంటే చూసిన నర్మద, సాగర్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -200 లో... సాగర్ కి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నర్మద చెప్తుంటుంది. సాగర్ చదువుతుంటే నర్మద పక్కనే ఉంటుంది. తను గట్టిగా చదువుతుంటే.. నువ్వు ఇలా చదివితే అందరు బయటకు వస్తారు.. అందరికి తెలిసిపోతుంది.. మెల్లగా చదవమని నర్మద అంటుంది. అయినా గట్టిగా చదువుతుంటే సాగర్ ని బయటకు తీసుకొని వెళ్లి ఇక్కడ చదువుకోమని నర్మద అంటుంది.

ఒక పక్క సాగర్ చదువుతుంటే నర్మద అటు వైపు పడుకొని ఉంటుంది. నర్మద నడుము ని చూస్తూ సాగర్ చదువకుండా డిస్టబ్ అవుతాడు. అలా కాదని సాగర్ పక్కన వచ్చి కూర్చుంటుంది నర్మద. దాంతో సాగర్ చదువుతాడు. సాగర్ చదవడం శ్రీవల్లి చూస్తుంది. రైస్ మిల్ లో పని చేసేవాడికి బుక్ తో ఏం పని కొంచెం ఆలోచించాలని శ్రీవల్లి అనుకుంటుంది. మరొకవైపు ధీరజ్ ని తీసుకొని గుడికి వస్తుంది ప్రేమ. ఎందుకు ఇంత ప్రొద్దున ఇక్కడికి తీసుకొని వచ్చావని ధీరజ్ అనగానే గుడికి ప్రొద్దున్నే వస్తారని ప్రేమ అంటుంది. అక్కడ పంతులు అందరికి మంచి మాటలు చెప్తుంటాడు.

ప్రేమ ఆ మాటలు విని నేను కూడా ధీరజ్ కి సాయంగా ఉండాలి.. మావయ్య ఏం అన్నా.. అత్తయ్య మాటలు అన్నా కూడా.. ధీరజ్ కి నేను సాయం ఉండాలని ప్రేమ డిసైడ్ అవుతుంది. తరువాయి భాగంలో శ్రీవల్లి వాళ్ళ నాన్న రోడ్ పై ఇడ్లీలు అమ్ముతుంటే ప్రేమ, నర్మద చూసి షాక్ అవుతారు. అతని దగ్గరకి వచ్చి బాబాయ్ ఇడ్లీ ఇవ్వు అనగానే సరేనని అతను వాళ్ళ వంక చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.