English | Telugu

Illu illalu pillalu : మీ నాన్న చెప్తేనే నన్న ముట్టుకుంటావా.. సాగర్ ని తిట్టేసిన నర్మద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -154 లో.....శ్రీవల్లి ప్రతీ విషయంలో తలదూరుస్తుంది. మావయ్య గారు తన కొడుకుని ఏమైనా అనుకుంటారు. ఆవిడకేంటి నవ్వుతుందని ప్రేమతో చెప్తుంది నర్మద. ఇంటికి పెద్దకోడలు కదా అందుకే నెత్తిన పెట్టుకుంటున్నారని నర్మద అంటుంది. ఏంటి తోటికోడళ్ళు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారని వేదవతి అంటుంది.

మీ కంటికి మేమ్ ఎలా కనిపిస్తాం లేండి.. మీకు పెద్ద కోడలు ఉంటే చాలు.. చేతిలో ఉన్న బజ్జీలు తీసుకొని వెళ్లినా కూడా మీ పెద్దకోడలు బంగారమని నర్మద అంటుంది. తను నా ఆరోగ్యం కోసమే కదా అలా తీసుకుందని వేదవతి అంటుంది. గంట సేపు లైన్ లో ఉండి తీసుకొని వచ్చింది పోయింది కానీ అలా తీసుకుంటే మీ కోసం అంటున్నారా అని నర్మద అనగానే.. నీ తెలివితేటలకి ఒక దండం.. నీ గవర్నమెంట్ తెలివి నాకు తెలుసని వేదవతి అంటుంది. ఎదుటి వారి విషయంలో వేలు పెట్టకని చెప్పండి మీ పెద్దకోడలికి అని నర్మద కాస్త కోపంగానే వేదవతికి చెప్తుంది. ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇక ముందు ముందు ఎలా ఉంటారోనని వేదవతి అనుకుంటుంది.

మరోవైపు నర్మద, సాగర్ మాట్లాడుకుంటారు. సారీ నర్మద బిల్ నేను కట్టలేకపోయానని సాగర్ అంటాడు. నువ్వు బిల్ కట్టలేనందుకు బాధగా లేదు.. నాతో టైమ్ స్పెండ్ చెయ్యందుకు బాధగా ఉందని నర్మద అంటుంది. నాన్నని పర్మిషన్ అడిగాను.. ఇవ్వలేదని సాగర్ అనగానే.. ఏంటి భార్యని బయటకు తీసుకొని వెళ్ళడానికి మీ నాన్నని పర్మిషన్ అడిగావా.. సిగ్గనిపించడం లేదా.. నన్ను ముట్టుకోవాలన్నా కూడా మీ నాన్న పర్మిషన్ అడిగేలా ఉన్నావని నర్మద అనగానే.. సాగర్ కోప్పడతాడు. అయిన నర్మద అంటూనే ఉంటుంది. సాగర్ ఏమనలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.