English | Telugu

Illu illalu pillalu : ఆ డ్రెస్ లో తనని చూసి ఇంప్రెస్ అయిన ధీరజ్.. కోపంగా ఉన్న రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -152 లో.... నర్మద సాగర్ కోసం వెయిట్ చేసి ఇంటికి వెళ్లిపోతుంటే.. అప్పుడే సాగర్ వస్తాడు. ఇంత లేట్ ఏంటని నర్మద అడుగగా.. పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయ్ అందుకే అని సాగర్ చెప్తాడు. అయ్యో మరి ఇంకొకసారి ప్లాన్ చేసుకునే వాళ్ళం కదా అని నర్మద అంటుంది. పర్లేదు వెళదామని సాగర్ రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తాడు.

ఆ తర్వాత ధీరజ్ వాటర్ క్యాన్ లు వెయ్యడం నెల అవుతుంది కాబట్టి అతనికి జీతం వస్తుంది. దాంతో ప్రేమకి ఒక డ్రెస్ తీసుకోవాలనుకుంటాడు. షాప్ కి వెళ్లి అడుగుతాడు. డ్రెస్ సైజ్ ఎంత అని షాప్ అతను అడుగుతాడు. ప్రేమకి ఫోన్ చేసి నీ సైజ్ ఏంత అని అడగడంతో ప్రేమ తప్పుగా అర్థం చేసుకొని తిడుతుంది. ఇక ఏం చెయ్యలేక ప్రేమ ఎలా ఉంటుందనేది షాప్ ఓనర్ కి చెప్పి ధీరజ్ ఒక డ్రెస్ తీసుకుంటాడు.

మరొకవైపు నర్మద, సాగర్ ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్లి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అనుకోకుండా అదే రెస్టారెంట్ కి రామరాజు రైస్ డెలివరీ కోసం వస్తాడు. అప్పుడే నర్మద, సాగర్ ని చూస్తాడు. సాగర్ కి రామరాజు ఫోన్ చేస్తాడు కానీ సాగర్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో అక్కడ నుండి రామరాజు వెళ్ళిపోతాడు. బిల్ వస్తుంది నా దగ్గర డబ్బులు లేవని సాగర్ అనగానే కోపంగా నర్మద బిల్ పే చేస్తుంది. తరువాయి భాగంలో ప్రేమకి తీసుకొని వచ్చిన డ్రెస్ ప్రేమ వేసుకుంటుంది. ఆ డ్రెస్ లో తనని చూసి ఫ్లాట్ అవుతాడు ధీరజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.