English | Telugu

Illu illalu pillalu: నర్మదతో మాట్లాడిన కలెక్టర్.. రామరాజుని పరిచయం చేస్తుందా?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -287 లో... ఈ ఇద్దరు కోడళ్ళు నా పరువు తీసేందుకే ఉన్నారు.. ఒక్క శ్రీవల్లి మాత్రమే నా పరువు గురించి ఆలోచిస్తుందని వేదవతితో రామరాజు చెప్తాడు. దాన్ని ఆసరాగా తీసుకొని నర్మద, ప్రేమలపై ఇంకా కోపం కలిగేలా శ్రీవల్లి మాట్లాడుతుంది. దాంతో ఏయ్ నువ్వు ఆపు అని వేదవతి ఆపుతుంది. అదంతా విని ప్రేమ, నర్మద బాధపడుతారు. శ్రీవల్లి మాత్రం బాగా అయిందంటూ డ్యాన్స్ చేస్తుంది.

మరొకవైపు భాగ్యం వాళ్ళు మిర్చి బండి పెట్టి అమ్ముతారు. తిరుపతి వచ్చి వాళ్ళతో మాట్లాడి, రామరాజుని పిలుస్తాడు. మీరేంటి ఇలా అని రామరాజు అడుగుతాడు. ఆస్తులన్నీ పోయాయి కదా మోసం చేసి బతకడం రాదు కదా అని భాగ్యం అంటుంది. అప్పుడే ఒకతను వచ్చి.. మీ వియ్యంకులు మిర్చి అమ్ముతారా బాగున్నాయ్.. మీరు తినండి అనగానే రామరాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు అమూల్య దగ్గరికి వచ్చి మాట్లాడమని విశ్వకి శ్రీవల్లి వచ్చి సైగ చేస్తుంది. అమూల్య దగ్గరికి విశ్వ వచ్చి.. నీకేం కావాలి చెప్పు కొనిస్తా అంటాడు. అప్పుడే కామాక్షి వచ్చి విశ్వని తిడుతుంది. తన భర్తని పిలిచి వాడిని కొట్టు అంటుంది. వాడు ఎలా ఉన్నాడు.. నేనెలా ఉన్నానని అతను భయపడతాడు.

ఆ తర్వాత ప్రేమ దగ్గరికి నర్మద వచ్చి.. నీ ప్రేమ విషయం ధీరజ్ కి చెప్పమని సలహా ఇస్తుంది. దాంతో ధీరజ్ దగ్గరికి వెళ్లి ప్రేమ సిగ్గుపడుతుంది. ఏమైందని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ చెప్పబోతుంటే ఒక చిన్న పాప కన్పించడం లేదని మైక్ లో చెప్తారు. దాంతో ఇద్దరు వెళ్లి ఆ పాప ఎక్కడుందో వెతకడంలో హెల్ప్ చేస్తారు.

మరొకవైపు బతుకమ్మ సంబరాల దగ్గరికి కలెక్టర్ వస్తాడు. ఎంతమంది నమస్కారం పెట్టినా రియాక్ట్ అవ్వడు కానీ నర్మద నమస్కారం పెట్టగానే ఆగి నువ్వు బెస్ట్ ఎంప్లాయి అవార్డు తీసుకున్నావ్ కదా అని మాట్లాడతాడు. సర్ మా ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చెయ్యొచ్చా అని నర్మద అడుగుతుంది. చెయ్ అని కలెక్టర్ అనగానే రామరాజుని నర్మద పిలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.