English | Telugu

Illu Illalu Pillalu : సాగర్ తో ప్రేమ విషయం ఆమె రామరాజుకి చెప్పనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -11 లో.. వేదవతికి కాలు బెనికితే రామరాజు కాళ్ళు పట్టుకొని మసాజ్ చేస్తుంటే.. వేదవతి మురిసిపోతుంది. ఎదురింట్లో ఉన్న భద్రవతి కుటుంబం వాళ్ళని అన్యోన్యంగా ఉండడం చూసి కుళ్ళుకుంటారు. ఇంకా వాడి పనిమనిషి బుద్ది పోలేదని భద్రవతి అనగానే.. అది భార్యపై ప్రేమ అని భద్రవతి తల్లి మురిసిపోతుంది.

ఆ తర్వాత వేదవతి తన అక్క భద్రవతితో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడుతుంది. అది చూసి నువ్వు ఆలా బాధపడకంటూ రామరాజు ప్రేమగా మాట్లాడతాడు. మరుసటి రోజు ఉదయం చందు ఆఫీస్ కి రెడీ అవుతుంటే.. సుభద్ర కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యడు. అప్పుడే ధీరజ్ వచ్చి.. లిఫ్ట్ చేసి స్పీకర్ లో పెడతాడు. దాంతో సుభద్ర ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. ఎందుకు రా ఆ అమ్మాయిని బాధపెడతావ్.. నువ్వు నీ ప్రేమ విషయం నాన్నతో చెప్పమని చందుని ధీరజ్ పంపిస్తాడు. కానీ చందు రామరాజుకి భయపడి చెప్పడు. అదంతా వేదవతి చూసి.. ఏంటి రా మీ అన్నని ఏదో చెప్పమంటున్నావని అడుగుతుంది. అదేం లేదు చెప్పాల్సిన వాళ్లు చెప్తే బాగుంటుందని ధీరజ్ అంటాడు.

ఆ తర్వాత అన్నాతమ్ముళ్ల మధ్య ఏదో నడుస్తుందని వేదవతి అనుకుంటుంది. మరొకవైపు నర్మద ఆఫీస్ కి వెళ్తుంది. ఈ రోజు మధ్యాహ్నం లీవ్ తీసుకొని రా.. పెళ్లిచూపులు అని వాళ్ల అమ్మ అంటుంది. ఇప్పుడే ఎందుకని నర్మద అంటుంది. మా మాటకి ఎందుకు ఎదురు చెప్తున్నావ్.. నువ్వు మధ్యాహ్నం వరకు రా అంటూ నర్మద పేరెంట్స్ అంటారు. తరువాయి భాగంలో కలవాలని సాగర్ కి నర్మద ఫోన్ చేస్తుంది. ఇప్పుడు వీలు కాదు అనడంతో డైరెక్ట్ మిల్ దగ్గరికి వస్తుంది నర్మద. రామరాజు ఎవరు కావాలని అడగడంతో సాగర్ వంక చూపిస్తుంది. సాగర్ టెన్షన్ పడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.