English | Telugu

బిందుకు ల‌భించిన ఫైన‌ల్ అమౌంట్ ఎంత‌?

బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ వెర్ష‌న్ కి మొత్తానికి ఎండ్ కార్డ్ ప‌డింది. అనేక విమ‌ర్శ‌లు.. కంటెస్టెంట్ ల గొడ‌వ‌ల మ‌ధ్య తొలి ఓటీటీ వెర్ష‌న్ అనుకున్న‌ట్టుగాపే విజ‌య‌వంతంగా ముగిసింది. ఇక గ‌త కొంత కాలంగా మ‌హిళా కంటెస్టెంట్ కప్ గెల‌వ‌డం లేదు. కావాల‌నే ఫిమేల్ కంటెస్టెంట్ ల‌ని తొక్కేసి మేల్ కంటెస్టెంట్ ల‌ని విజేత‌ల‌ని చేస్తున్నారంటూ బిగ్ బాస్ నిర్వాహ‌కుల‌పై గ‌త కొంత కాలంగా విమర్శ‌లు వినిపిస్తూనే వున్నాయి. ఆ విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ తొలి ఓటీటీ బిగ్ బాస్ వెర్ష‌న్ విజేత‌గా బిందు మాధ‌వి నిలిచిందింది.

ఇంత‌కీ ప్రైజ్‌మ‌నీ కింద త‌న‌కు ద‌క్కింది ఎంత‌?.. 12 వారాల‌కు అమెకు ఎంత ఇచ్చారు? ప్రైజ్ మ‌నీ ప్ల‌స్ 12 వారాలు మొత్తం క‌లిపి బిందు మాధ‌వి ఎంత సొంతం చేసుకుంది? అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. బింగ్ బాస్ నాన్ స్టాప్ విజేత‌గా బిందు మాధ‌వికి ద‌క్కిన ప్రైమ్ మ‌నీ రూ. 40 ల‌క్ష‌లు మాత్ర‌మే. నిజానికి అస‌లు ప్రైజ్ మ‌నీ 50 ల‌క్ష‌లు. కానీ గ్రాండ్ ఫినాలే రోజు అరియానా గ్లోరీ రూ. 10 ల‌క్ష‌లు ద‌క్కించుకుంది. రేసు నుంచి తెలివిగా త‌ప్పుకుంది. దీంతో బిందు ప్రైజ్ మ‌నీలో ఆ రూ. 10 ల‌క్ష‌లని క‌ట్ చేశారు. అలా బిందుకు ప్రైజ్ మ‌నీ కింద ద‌క్కింది రూ. 40 ల‌క్ష‌లే.

అయితే 12 వారాలు షోలో కంటిన్యూ అయినందుకు గానూ రోజు పారితోషికం లెక్క‌న బిందు మాధ‌వికి భారీగానే అందిన‌ట్టుగా తెలుస్తోంది. 12 వారాల‌కు గానూ బిందు మాధ‌వికి 55 నుంచి 60 ల‌క్ష‌ల వ‌ర‌కు అందిన‌ట్టుగా చెబుతున్నారు. అంటే ప్రైజ్ మ‌నీతో క‌లిపి మొత్తం బిందు సొంతం చేసుకున్న మొత్తం కోటి రూపాయ‌లు అన్న‌మాట‌. అయితే ఇందులో 10 ల‌క్ష‌లు ట్యాక్స్ రూపంలో క‌ట్ అవుతుంది కాబ‌ట్టి బిందుకు మొత్తంగా ద‌క్కిన అమౌంట్ రూ. 90 ల‌క్ష‌లు. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.