English | Telugu

గుప్పెడంత మనసు సీరియల్ టీంని మిస్సవుతున్నాం

గుప్పెడంత మనసు సీరియల్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ని అందులోనూ లేడీ ఫాన్స్ ని ఆకట్టుకుంది. రిషి, వసుధారా, శైలేంద్ర, ధరణి జోడీలుగా నటించారు. ఇక ఈ సీరియల్ ఐపోయాక ఆడియన్స్ అంతా కూడా కొంచెం డల్ ఐనట్టే కనిపిస్తున్నారు. రిషి సర్ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. ఐతే ఇప్పుడు రిషి సర్ ఒక మూవీలో నటిస్తున్నాడు. అలాగే జగతి మేడం కూడా మూవీస్ లో నటిస్తోంది. ఇక ధరణి, సురేష్ బాబు, సాయి కిరణ్ వేరే సీరియల్స్ లో నటిస్తున్నారు. ఇక వసుధారా ప్రస్తుతానికి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.

తాజాగా శైలేంద్ర అలియాస్ సురేష్ బాబు "ఏటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయ్యింది వయసు" అనే సాంగ్ కి రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఇక నెటిజన్స్ ఐతే "ధరణి దగ్గరకు వెళ్ళిపోయుంటుంది మనసు...మిమ్మల్నందరినీ మిస్ అవుతున్నాం. మీరు గుప్పెడంత మనసు పార్టీ 2 తో వెంటనే వచ్చేయండి..సురేష్ బాబు గారు గుప్పెడంత మనసులో మీ యాక్టింగ్ సూపర్ సార్ సీరియల్ అయిపోయాక తిరిగి సూర్యకాంతంలో కనబడడం చాలా సంతోషంగా ఉంది.." అంటూ మెసేజెస్ పెడుతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.