English | Telugu

మణికంఠని రోస్ట్ చేసిన గంగవ్వ.. ఇదెక్కడి మాస్ రా మామ!


ఓరీ మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయిర్రా నాకు అన్నట్టుగా నాగ మణికంఠ భావిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్-8 మొదలైనప్పటి నుండి‌ మణికంఠ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు. అయితే టాస్క్ లో క్లియర్ గా సంఛాలక్ గా చేసే మణికంఠ.. కాస్త వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు.‌ అదే విషయాన్ని చెప్తూ గంగవ్వ ఓ ఆట ఆడుకుంది.

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.. ఆరు పదుల వయస్సులో సెలబ్రిటీగా మారిన గంగవ్వకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తన కల నెరవేర్చుకుంది. అయితే ఈ ఇంటి నిర్మాణం కోసం నాగార్జున సాయం చేసినట్లు స్టేజ్ మీదే వెల్లడించింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ, మెహబూబ్, మణికంఠ, టేస్టీ తేజ గార్టెన్ ఏరియాలో ఉన్నారు. ఇక గంగవ్వ తన మాటలతో , పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఓ పిలగా.. నా భార్య కావాలి.. నా పాప కావాలని ఏడ్చింది నువ్వే నాకు తెలుసు అని‌ గంగవ్వ అనగానే.. అవును కావాలని మణికంఠ అంటాడు. అయితే నామినేషన్ వేస్తా వెళ్ళని అనగానే.. మరి పైసల్ కావాలి కదా.. హౌస్ లోకి వచ్చింది పైసల కోసం కాదా అని గంగవ్వ అంది. అయిన గట్ల ఏడుస్తున్నాడేంది ఈ మగ బాయ్ అని అనుకున్నానంటూ గంగవ్వ అనగానే.. టేస్టీ తేజ, మెహబూబ్ నవ్వుకున్నారు.

ఇక అంతకముందు నబీల్, నిఖిల్, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ అందరు గార్డెన్ ఏరియా దగ్గరలోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటన్నారు. కాస్త ఆ పాలు ఇస్తే మేం ఛాయ్ చేసుకుంటామని గంగవ్వ అనగానే.. మిల్క్ లగ్జరీ అని నబీల్ అన్నాడు. మరి అలా చెప్తే మేం పాల ప్యాకెట్లు తెచ్చుకునేవాళ్ళ‌ం కదా అని గంగవ్వ అంది. అయిన మా సీజన్ లో ఫుల్ పాలు.. పెద్దదాన్ని కదా నాకు ఇవ్వమని గంగవ్వ అనగానే.. నేను కూడా పెద్దదాన్నే అని అక్కడే ఉన్న రోహిణి అనగానే.. నీకెంత మంది పిల్లలు అని గంగవ్వ అంది. ఇక రోహిణితో పాటు అక్కడివారంతా ఫల్లుమని నవ్వేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.