English | Telugu

Eto Vellipoyindhi Manasu : వెంచర్ పై తన పేరు చూసి సీతాకాంత్ షాక్.. రామలక్ష్మి ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -297 లో....శ్రీవల్లి, శ్రీలతకి కాఫీ తీసుకొని వచ్చి ఇద్దరికి షేర్ చేస్తుంది. ఎందుకు అలా చేస్తున్నావని శ్రీలత అడుగగా.. ఇంట్లో పాల ప్యాకెట్ లేదు.. పైగా డబ్బులు కూడా లేవని అంటుంది. రాను రాను మన పరిస్థితి ఏంటోనని శ్రీవల్లి అంటుంది. అప్పుడే సందీప్, ధన లు వచ్చి ఇంట్లో అందరిని పిలుస్తారు. మేము సంపాదించలేమన్నారు కదా.. మా తెలివితో ఎంత సంపాదించామోనని సందీప్, ధనలు గొప్పగా చెప్తూ డబ్బు చూపిస్తారు.

అది చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఇంత డబ్బా అని మురిసిపోతుంది. చూసావా సిరి ఎంత సంపాదించానో.. ఏం చేసిన నీ కోసమేనని సిరితో ధన అంటాడు. మరొకవైపు ఒక పెద్దావిడ సీతాకాంత్, రామలక్ష్మి దగ్గరికి వచ్చి మీరు దాచుకున్న డబ్బు ఉంటే ఇందులో వెంచర్ తీసుకోండి.. వీళ్ళు తక్కువ డబ్బుకే ఇస్తున్నారంటు ఒక పేపర్ చూపిస్తుంది‌ అది చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు‌ తన పేరు వాడుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని సీతాకాంత్ కి అర్థమవుతుంది. అదేంటి మీ పేరు వాడుకొని అలా చేస్తున్నారు అని రామలక్ష్మి అంటుంది. అదేంటో తెలుసుకుంటా మనం గుడికి వెళదామన్నావ్ కదా పదా అని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు ధన, సందీప్ , భద్రం ఆఫీస్ లో ఉంటారు. కస్టమర్స్ వస్తుంటారు.. ఫ్లాట్స్ సేల్ చేస్తుంటారు. అదేసమయంలో సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు ఒక పాసింజర్ ని హాస్పిటల్ కి తీసుకొని వస్తారు. అప్పుడే హాస్పిటల్ లో చెకప్ చేయించుకొని సిరి, శ్రీలత, శ్రీవల్లి లు వస్తారు. సీతాకాంత్ ని చూసి అన్నయ్య అంటూ సిరి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మేము రిచ్ అయ్యామంటూ శ్రీవల్లి డబ్బులు తీసి చూపిస్తుంది.

మరొకవైపు అసలేం జరుగుతుందని సీతాకాంత్ ఆఫీస్ లో తెలిసిన అతన్ని పిలిపించుకొని ఆఫీస్ లో ఏం జరుగుతుందని అడుగగా.. కొత్తగా వెంచర్ మొదలు పెట్టారు. ఎవరో భద్రం వస్తున్నాడని చెప్తాడు. మరొక వైపు రామలక్ష్మి కూడా వెంచర్ లో ఫ్లాట్ తీసుకున్న వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అసలు విషయమేంటో కనుక్కుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మిలు ఇంటికి వెళ్లి భోజనం చేస్తూ ఆఫీస్ లో జరిగేదాని గురించి మాట్లాడుకుంటారు. ఆ భద్రం గాడు చాలాసార్లు నా దగ్గరికి వచ్చాడు.. నేను తిట్టి పంపించాను.. ఇప్పుడు వాళ్ళని మోసం చేస్తున్నాడని సీతాకాంత్ అంటాడు. మరుసటి రోజు సందీప్, ధనలు భద్రం చెప్పినట్టు వింటూ ఈజీగా మోసపోతుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.