English | Telugu

Eto Vellipoyindhi Manasu : సీఈఓ పదవి వదిలి ఆటో నడుపుకుంటున్న సీతాకాంత్.. భద్రం ఆట మొదలైందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -294 లో.....సందీప్, ధన లు ఇంటికి వచ్చి ఆనందంగా అమ్మ అంటూ పిలుస్తారు. ఎంటి ఇంత హ్యాపీగా ఉన్నారని శ్రీవల్లి అంటుంది. మన ప్రాబ్లమ్ అని క్లియర్ అయ్యే అవకాశం దొరికిందని భద్రం గురించి చెప్తాడు సందీప్. అప్పుడే భద్రం వస్తాడు. మీ ప్రాబ్లమ్ అన్నిటిని నేను సాల్వ్ చేస్తానని శ్రీలతకి చెప్తాడు. ఒక్క రూపాయి మీరు పెట్టుబడి పెట్టనవసరం లేదని భద్రం అనగానే.. శ్రీలత వాళ్ళు సరే అంటారు. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా అంటేనే కదా.. మీరు నా మాట వింటారని భద్రం అనుకుంటాడు.

మరొకవైపు రామలక్ష్మి ఆటోకి పూజ చేస్తుంది. డ్రైవర్ కష్టాలు సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. ఆ తర్వాత రామలక్ష్మి చిటికె వెయ్యగానే ఇంకొక ఆటో వస్తుంది. ఒకటి రామలక్ష్మి ఇంకొకటి సీతాకాంత్ కి దానికి కూడా రామలక్ష్మి పూజ చేస్తుంది. ఇద్దరు ఆటో నడపడానికి చెరొకవైపు వెళ్తారు.

మరొకవైపు సందీప్, ధన లు ఆఫీస్ కి వెళ్లి.. నేను సీట్ లో కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అంటూ గొడవపడతారు. దాంతో మీరు ఆపండి ఆఫీస్ గురించి ముందు నాకు చెప్పండి అని భద్రం అనగానే సందీప్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆటోలో ఒకతను ఎక్కుతాడు. తన ఆఫీస్ టెన్షన్ లో ఉంటే తనకి మంచి ఐడియా ఇస్తాడు. దాంతో అతను సీతాకాంత్ కి థాంక్స్ చెప్తాడు. కొంత డబ్బిచ్చి మీరు నాకు అడ్వైజర్ గా ఉండాలని అతను చెప్పి సీతాకాంత్ నెంబర్ తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.