English | Telugu

కోడలు ఇంటిలిజెన్స్ చూసి అత్త షాక్.‌. సంతోషంలో భర్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ '‌ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -212 లో......అందరు కొటేషన్ లతో బిట్ వెయ్యడానికి వెళ్తారు. రామలక్ష్మి కొటేషన్ తో ఎంట్రీ ఇస్తుంది. అందరు బిట్ వేసాక రిజల్ట్స్ కోసం చూస్తుంటారు. అందరి కోటేషన్లు చూసి ఎవరు తక్కువ వేస్తే వాళ్లకు బిట్ ఇవ్వాలని వాళ్లు అనుకుంటారు. అంతకుముందే వేరొకా కంపెనీ కి బిట్ ఇవ్వాలని ముందే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. తీరా చుస్తే వాళ్ళ కంటే సీతాకాంత్ వేసిన బిట్ తక్కువ అమౌంట్ తో వేసి ఉంటుంది. ఇదేంటి సీతాకాంత్ బిట్ అందరికంటే తక్కువ ఉందని అనుకుంటారు.

ఆ తర్వాత ముందు డబ్బులు తీసుకున్న అతనికి వాళ్ళు ఫోన్ చేసి పక్కకి రమ్మని చెప్పి.. మీ కంటే సీతాకంత్ కొటేషన్ తక్కువ వేసాడు. న్యాయం గా అయితే వాళ్ళకే వెళ్ళాలి కానీ మీరు డబ్బులిస్తే మీకు వస్తుందనగానే అతను డబ్బులు ఇస్తాడు. అదంతా రామలక్ష్మి చూసి వీడియో తీస్తుంది. అందరు బయటకు వచ్చి ఈ బిట్ శ్రీజ గ్రూప్ కి వెళ్తుందని చెప్పగానే అదేంటి అందరికన్న మేమే తక్కువ వేసాము కదా అని రామలక్ష్మి అంటుంది. మీది రిజెక్ట్ చేసాం సీతాకాంత్ గారి సైన్ లేదు.. మీ సైన్ లేదు అని వాళ్లు అనగానే అక్కడున్న వాళ్ళందరూ ఆడవాళ్ళ కీ పెత్తనమిస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పటివరకు ఓటమి అంటూ తెలియదు సీతాకాంత్ అంటారు. లేదు నేను అన్ని బానే మెయిల్ చేసానని రామలక్ష్మి అంటుంది. డబ్బులు తీసుకున్న అతన్ని రామలక్ష్మి పక్కకు పిలిచి డబ్బులు తీసుకున్న వీడియో చూపిస్తుంది. సారీ మేడమ్ తప్పు చేసాను అంటాడు. ఆ తర్వాత అందరి ముందు వచ్చి సీతాకాంత్ గారు బిట్ గెలుచుకున్నారని చెప్తాడు. దాంతో రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

మరొకవైపు ఎటాక్ లు చేస్తుంది ఎవరో కనుకోవడానికి సీతాకాంత్ ఒక డిటేక్టివ్ ని ఏర్పాటు చేస్తాడు. అతను వచ్చి సీతాకాంత్ తో మాట్లాడతాడు. జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ నందిని ఫోటో చుపించి ఈమె చేసిందేమో డౌట్ గా ఉందని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వస్తుంది. అందరూ బిట్ మనకే వచ్చిందా అంటూ అడుగుతారు. రామలక్ష్మి సైలెంట్ గా ఉండడంతో బిట్ పోయిందంటు శ్రీవల్లి అంటుంది. అప్పుడే ఎవరో సీతాకాంత్ కీ ఫోన్ చేసి బిట్ వచ్చిందని చెప్తారు. ఆ విషయం సీతాకాంత్ అందరికి చెప్తాడు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేంటి ఎలా వచ్చిందని శ్రీవల్లి శ్రీలతలు అనుకుంటారు. మరొకవైపు సీతాకాంత్ అన్న మాటలు నందిని గుర్తుచేసుకుంటుంది. అప్పుడే హారిక వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.